అసెంబ్లీలో తమ్ముళ్ళకి మళ్ళీ బొమ్మే.. వైసీపీ చుక్క‌లు చూపించేస్తుందా...!

VUYYURU SUBHASH
ఒకప్పుడు అసెంబ్లీ సమావేశాలు అంటే...ప్రజా సమస్యలపై చర్చ జరిగే వేదిక...కానీ ఇప్పుడు అది బూతులు మాట్లాడే వేదిక అయిపోయింది..ఒకప్పుడు అధికార-ప్రతిపక్షాల మధ్య రాజకీయం యుద్ధం జరిగితే...కాకపోతే అది నిర్మాణాత్మకంగా జరిగేది..అడ్డగోలుగా మాట్లాడటం, ఒకరినొకరు బూతులు తిట్టుకోవడం ఉండే కాదు. అలాగే అధికార పక్షం..ప్రతిపక్షానికి కాస్త మాట్లాడటానికి సమయం ఇచ్చేది...కానీ ఇప్పుడు అలా లేదు..ప్రతిపక్ష నేతలు మాట్లాడితే చాలు మైక్‌లు కట్ చేయడం...లేదా అధికార పార్టీ వాళ్ళు అడ్డుపడటం జరిగిపోతుంది.

వాస్తవానికి చెప్పాలంటే అసెంబ్లీ సమావేశాల వల్ల ప్రజలకు ఒరిగేది ఏమి లేదని చెప్పొచ్చు. అయితే ఇటీవల ప్రతిపక్ష టీడీపీ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలా? వద్దా? అనే దానిపై పెద్ద చర్చ చేసింది. ఎందుకంటే కిందట అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబుకు ఎలాంటి ఘోర అవమానం జరిగిందో అందరికీ తెలిసిందే...బాబు భార్య సతీమణి భువనేశ్వరి గురించి...వైసీపీ నేతలు అసభ్య పదజాలం వాడిన విషయం తెలిసిందే. దీనిపై చంద్రబాబు కన్నీటి పర్యంతమై...ఇంకా అసెంబ్లీ సమావేశాలకు రానని, మళ్ళీ సీఎం అయ్యాకే అడుగుపెడతానని చెప్పారు.

దీంతో తాజాగా జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు బాబు హాజరు కావడం లేదు..అయితే బాబు వెళ్ళడం లేదు కాబట్టి..టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం హాజరు కాకూడదని టీడీపీ శ్రేణులు అనుకున్నాయి..కానీ కొంతమంది సీనియర్ నేతలు బడ్జెట్ సమావేశాలు కాబట్టి..రాష్ట్ర ఆర్ధిక పరిస్తితిపై చర్చ జరుగుతుంది కాబట్టి, సమావేశాలకు వెళ్లాలని సూచించారు. ఈ క్రమంలోనే సమావేశాలకు హాజరు కావాలని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిసైడ్ అయ్యారు.

అయితే సమావేశాలకు వెళ్ళిన సరే పెద్దగా ఉపయోగం ఉండదని, మళ్ళీ వైసీపీ చేతిలో అవమానం ఎదురుకోవాల్సి వస్తుందని, వారు ఏదొరకంగా అవమానించేలా మాట్లాడతారని, అలాగే మాట్లాడే అవకాశం కూడా పెద్దగా దక్కనివ్వరని, అలాంటప్పుడు సమావేశాలకు వెళ్లాల్సిన అవసరం ఏముందని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి..సమావేశాలకు వెళ్లకుండా ప్రజల్లోకి వెళితే బెటర్ అని అంటున్నారు. కానీ సమావేశాలకు వెళ్లాలని ఎమ్మెల్యేలు డిసైడ్ అయ్యారు..మరి అసెంబ్లీలో ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: