జ‌గ‌న్ ఆ నిజం తెలుసుకోక పోతే నిండా మున‌గాల్సిందే...!

VUYYURU SUBHASH
గ్రౌండ్ రియాల్టీ ఎవ‌రికైనా అవ‌స‌ర‌మే! పార్టీ అయినా.. నాయ‌కుడైనా.. ప్ర‌భుత్వ‌మైనా.. ఎవ‌రైనా స‌రే.. గ్రౌండ్ లెవిల్లో ఏం జ‌రుగు తోంద‌నేది తెలుసుకోవాల్సిందే. అయితే.. ఏపీలో పాలించిన పార్టీ టీడీపీ ఈ విష‌యంలో అతిగా ప్ర‌వ‌ర్తించింద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ప్ర‌తి విష‌యానికీ.. ఉలిక్కిప‌డ‌డం... ప్ర‌తి విష‌యాన్నీ.. సీరియ‌స్‌గా తీసుకోవ‌డం.. అతిగా స్పందించ‌డం తెలిసిందే. దీంతో పార్టీ ఒక ర‌కంగా ఆత్మ ర‌క్ష‌ణ‌లో ప‌డిపోయింది. దీంతో కార్య‌క‌ర్త‌ల‌కు ప్ర‌భుత్వానికి మ‌ధ్య తీవ్ర‌మైన గ్యాప్ వ‌చ్చింది. దీంతో ఎన్నికల స‌మ‌యం లో వారిని బ్ర‌తిమాలుకునేందుకు చంద్ర‌బాబు స‌హా నాయ‌కులు ఎంత క‌ష్ట‌ప‌డ్డారో అంద‌రికీ తెలిసిందే.

ఇక‌, ఇప్పుడు వైసీపీ స‌ర్కారు విష‌యానికి వ‌స్తే.. గ్రౌండ్ లెవిల్లో ప‌రిస్థితిని ప‌ట్టించుకునే నాథుడు క‌నిపించ‌డం లేదు. వాస్త‌వానికి క్షేత్ర‌స్థాయిలో ఇంత బ‌ల‌మైన పార్టీ  పొరుగున ఉన్న ఒక్క ఒడిసాలో త‌ప్ప దేశంలోనే లేద‌ని చెప్పాలి. పంచాయ‌తీలు, కార్పొరేష న్లు, జిల్లా, మండ‌ల ప‌రిష‌త్‌లు ఇలా ఎటు చూసుకున్నా.. వైసీపీ జెండా రెప‌రెప‌లే క‌నిపిస్తున్నాయి. వైసీపీ సునామీ తాలూకు ప్ర‌భంజ‌న‌మే క‌నిపిస్తోంది. అయితే.. ఇంత బ‌లం ఉన్నా.. క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌లు చివురుటాకుల్లా వ‌ణికిపోతున్నారు. ఎవ‌రూ త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. ఎవ‌రూ త‌మ‌కు భ‌రోసా ఇవ్వ‌డం లేద‌ని వారు వాపోతున్నారు.

గ‌తంలో చంద్ర‌బాబు హ‌యాంలో ప‌ట్టించుకుని అతి చేస్తే.. ఇప్పుడు అస‌లు ప‌ట్టించుకునే తీరిక కూడా నేత‌ల‌కు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో పార్టీ ప‌రంగా క‌ష్ట‌ప‌డి ప‌నిచేసిన కార్య‌క‌ర్త‌లు.. ఇప్పుడు అదే పార్టీకి ప్ర‌త్య‌ర్థులుగా మారుతున్నారంటే ఆశ్చ‌ర్యం అనిపించ‌క‌పోదు. చాలా మంది కార్య‌క‌ర్త‌లు.. ఇటీవ‌ల కాలంలో ధైర్యం చేసి వాట్సాప్ ద్వారా.. త‌మ స‌మ‌స్య‌లు వినిపిస్తున్నారు. నిన్న మొన్న‌టి వ‌రకు ఒక‌రిద్ద‌రు ఉన్న ఈ సంఖ్య‌.. ఇప్పుడు ప‌దుల సంఖ్య‌కు చేరుకుంది. రాబోయే రోజుల్లోనూ ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే.. ఈ అసంతృప్తుల సంఖ్య వేల‌ల్లోకి ల‌క్ష‌ల్లోకి చేరినా ఆశ్చ‌ర్యం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.\

మ‌రి ఇప్ప‌టికైనా.. అస‌లు గ్రౌండ్ లెవిల్లో.. ఏం జ‌రుగుతోంది? గ‌త ఎన్నిక‌ల‌ప్పుడు.. మ‌న‌కు వీరు ఎలా సాయం చేశారు?  ఇప్పుడు వీరిని ఎలా ఆదుకోవాలి?  అనే విష‌యాల‌పై పార్టీ అధినేత‌గా బాధ్య‌త ఉన్న సీఎం జ‌గ‌న్ ఆలోచించాల్సిన అవ‌స‌రం.. ఉంది. అదే స‌మ‌యంలో వారికి స్వాంతన చేకూర్చాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. లేక‌పోతే.. అప్పుడు అతి.. ఎలా అయితే.. టీడీపీకి న‌ష్టం చేకూర్చిందో ఇప్పుడు ఉదాసీన‌త వైసీపీకి అంతే న‌ష్టం చేకూర్చ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: