నాటి బాబు క‌న్నీళ్లు నేడు.. క‌దిలిస్తున్నాయా..?

VUYYURU SUBHASH
క‌న్నీళ్ల‌కు చాలా బ‌లం ఉంటుంది. క‌న్నీళ్లు ఏదైనా సాధిస్తాయి. అయితే.. టీడీపీ విష‌యంలో ఇది కొంచెం ఆల‌స్యంగా జ‌రుగుతోం ది. గ‌త ఏడాది న‌వంబ‌రులో జ‌రిగిన ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో టీడీపీ అదినేత చంద్ర‌బాబు కుటుంబాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు.. అవ‌మా న ప‌రిచారంటూ.. బాబు బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మీడియా ముందు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. క‌న్నీ ళ్లు కూడా పెట్టుకున్నారు. మ‌ళ్లీ సీఎం అయితే.. త‌ప్ప స‌భ‌లోకి అడుగు కూడా పెట్టేది లేద‌ని శ‌ప‌థం చేశారు. ఇది అప్ప‌టికి ముగిసిపోయింది. చంద్ర‌బాబు శ‌ప‌థాన్ని దాదాపు అంద‌రూ మ‌రిచిపోయార‌నే చెప్పాలి.

ఎందుకంటే.. రెండు మాసాలు గ‌డిచిపోయినా.. చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు ఏ త‌మ్ముడూ ముందుకు క‌ద‌ల‌లేదు. దీంతో ఇక‌, చంద్ర‌బా బు శ‌ప‌థం కూడా గాలికిపోయిన‌ట్టేన‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే.. తాజాగా నారా లోకేష్‌.. మ‌రోసారి ఈ ఘ‌ట‌న‌పై స్పం దించారు. త‌న త‌ల్లికి జ‌రిగిన అవ‌మానంపై ఆయ‌న ఆవేశంగా మాట్లాడారు. త‌న తండ్రి చేసిన శ‌ప‌థాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు. తాను ఊరుకునేది లేద‌ని.. త‌న తండ్రిని, త‌ల్లిని అవ‌మానించిన వారికి త‌గిన బుద్ధి చెబుతాన‌ని అన్నారు.

ఏమైందో.. ఏమో.. ఈ వ్యాఖ్య‌లు బాగానే వ‌ర్కవుట్ అయింది. సోష‌ల్ మీడియాలో లోకేష్ వ్యాఖ్య‌లు బాగానే వైర‌ల్ అయ్యాయి. దీంతో టీడీపీ నేత‌లు ముందుకు క‌దిలారు. తాజాగా కొంద‌రు నాయ‌కులు.. చంద్ర‌బాబు కోసం.. తాము ఏమైనా చేసేందుకు రెడీ అంటూ.. సోష‌ల్ మీడియా వేదిక‌గా చెప్పుకొచ్చారు. త‌మ అధినేత‌ను సీఎంను చేయ‌డ‌మే త‌మ‌కున్న ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని.. రాజ‌మండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భ‌వానీ.. పేర్కొన‌డం దీనికి ప్ర‌దాన  ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు.

ఇక‌, మిగిలిన నాయ‌కులు కూడా త‌మ ల‌క్ష్యం.. చంద్ర‌బాబు క‌న్నీరు త‌మ‌ను క‌దిలించింద‌న్నారు. అంతేకాదు.. ఎవ‌రైతే.. చంద్ర‌బాబుకు క‌న్నీళ్లు పెట్టించారో.. వారితో ర‌క్త క‌న్నీళ్లు పెట్టిస్తామ‌ని.. మ‌రికొంద‌రు నాయ‌కులు స్ప‌ష్టం చేశారు. మొత్తానికి ఈ ప‌రిణామం చూస్తే.. ఆ నాటి చంద్ర‌బాబు క‌న్నీళ్లు అప్ప‌ట్లో క‌దిలించ‌క‌పోయినా.. ఇప్పుడు మాత్రం క‌దిలిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: