వైసీపీ కీల‌క నేత‌ల ఆవేద‌న... ఆక్రోశానికి అస‌లు క‌థ ఇదా...!

VUYYURU SUBHASH
త‌మ‌కు ఇది కావాలి! అని అడ‌గ‌లేరు. త‌మ‌కు ప్రాధాన్యం లేకుండా చేస్తున్నార‌ని.. నేరుగా చెప్ప‌లేరు. ఇలా అయితే.. త‌మ‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో డిపాజిట్లు కూడా ద‌క్క‌వ‌నే విష‌యం తెలిసి.. మౌనంగా ఉండ‌లేరు.. ఇదీ.. ఇప్పుడు వైసీపీలోని చాలా మంది నేత‌ల ప‌రిస్థితి! వీరిలో ఎక్కువ మంది గ‌త ఎన్నిక‌ల‌కు ముందు పార్టీ మారి వ‌చ్చిన‌వారే కావ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఆవేద‌న ఒక‌టి ఉంటే.. మ‌రోకార‌ణం చూపి.. ఆక్రోశం వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో వైసీపీ రాజ‌కీయాలు రోడ్డున ప‌డుతున్నాయి. ప్ర‌స్తుతం రాష్ట్రంలో జిల్లాల ఏర్పాటు అంశం.. సొంత పార్టీలోనే సెగ పెడుతోందని వార్త‌లు వ‌స్తున్నాయి.

కానీ, వాస్త‌వంగా.. జిల్లాల ఏర్పాటు అంటేనే.. కొన్ని కొన్ని మండ‌లాలు.. మారుతాయి. అదే స‌మ‌యంలో ప్ర‌స్తుతం ఉన్న జిల్లాల రూపు రేఖ‌లు కూడా మారుతాయి. ఈ విష‌యం నాయ‌కుల‌కు తెలియంది ఏమీ కాదు. నిజానికి ఎక్క‌డి జిల్లాలు అక్క‌డే, ఎక్క‌డి మండ‌లాలు అక్క‌డే ఉంటే.. విభ‌జ‌న ఎందుకు ?  ఇప్పుడున్న స్వ‌రూపం అలాగే ఉండిపోతే..మార్పు ఎందుకు ? ఈ విష‌యం తెలిసి కూడా.. నాయ‌కులు హ‌డావుడి చేస్తున్నారు. మా నియోజ‌క‌వ‌ర్గంలో ఆందోళ‌న చేస్తున్నారు.. ఆ మండ‌లాల‌ను విడ‌దీయొద్దు.. ఈ ప్రాంతాల ను మార్చొద్దు.. అంటూ మీడియా ముందుకు వ‌చ్చి.. జిల్లాల విభ‌జ‌న అశాస్త్రీయం అని నోరు చేసుకుంటు న్నారు.

ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు కూడా చేస్తున్నారు. వాస్త‌వానికి ఇలా డిమాండ్ చేస్తున్న‌వారికి .. జిల్లాల విభ‌జ‌నే కార‌ణ‌మా?  లేక ఏదైనా ఉందా? అంటే.. పైన చెప్పుకొన్న విధంగా.. వారి చిత్తం ప‌ద‌వుల మీద‌.. గుర్తింపుపైనా ఉంది. భ‌క్తి మాత్రం.. ఏదో చిన్న‌పాటి డిమాండ్ల‌నైనా..ప‌ట్టుకుని మీడియా ముందుకు వ‌చ్చేలా చేస్తోంది. దీంతో ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, మేడా మ‌ల్లికార్జున రెడ్డి, రోజా.. ఇలా ప‌లువురు నాయ‌కులు రోడ్డెక్కుతున్నారు. వాస్త‌వానికి వీరంతా.. కూడా గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌.. మంత్రి ప‌ద‌వులు ఆశించిన వారే.

అయితే.. కొన్ని అనివార్య కార‌ణాల‌తో వారికి ప‌ద‌వులు ద‌క్క‌లేదు. దీంతో ఇప్పుడు త‌మ‌కు ప‌ద‌వులు ఇవ్వాల‌నే డిమాండ్‌ను ప‌రోక్షంగా వెల్ల‌డిస్తూ.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.. అంతే! ఇప్పుడు ఇదే విష‌యం అధికార పార్టీలోనూ చ‌ర్చ‌కు దారితీయ‌డం గ‌మ‌నార్హం. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: