లోకేష్ కోసం.. టీడీపీ రూల్స్ మార్చేస్తోన్న చంద్రబాబు..!
టీడీపీ ఆవిర్భావం నుంచి అధ్యక్షుడి పదవి ఒక్కటే ఉంది. ఉపాధ్యక్ష పదవి లేదు. అదే సమయంలో కార్యదర్శులు ఉన్నారు. కానీ,.. చంద్రబాబు గత 2014 ఎన్నికలకు ముందు పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించారు. తమిళనాడులోను.. ఒడిసాలోనూ.. తెలంగాణలోనూ.. పార్టీ ఉందని.. ఇక్కడ తమకు ప్రాతినిధ్యం కూడా ఉందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తనను జాతీయ పార్టీ అధ్యక్షులుగా .. తన కుమారుడిని.. జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేశారు.
అయితే..ఇప్పుడు టీడీపీలో రూల్స్ మార్చి.. పార్టీలో మరో రెండు కొత్త పదవులు సృష్టించాలని నిర్ణయించారు. పార్టీ జాతీయ వ్యవహారాల అధ్యక్షుడు, అదేవిధంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే పదవులు తీసుకువస్తా మని చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది. వాస్తవానికి వర్కింగ్‌ప్రెసిడెంట్ అనే పదవి ఇప్పటి వరకు టీడీపీలో లేదు. కానీ, ఇప్పుడు తీసుకువస్తున్నారు. గతంలో ఈ పదవి కోసం చంద్రబాబు వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య పేరు కూడా వినిపించింది.
ఇక ఇప్పుడు ఇది మరోసారి తెరమీదకు తీసుకు రావడంతో... దీనిని లోకేష్‌ను దృష్టిలో పెట్టుకునే చేస్తన్నారని అంటున్నారు పరిశీలకులు. తద్వారా.. తనకు ఉన్న అధికారాల్లో కొన్నింటిని.. లోకేష్‌కు ఇచ్చే ప్రయత్నం చేయాలని .. చంద్రబాబు యోచిస్తున్నారు. అయితే.. దీనిపై చర్చించిన చంద్రబాబు తుది నిర్ణయం తీసుకునేందుకు తనకు తానే గడువు విధించుకున్నారు. మరి దీనిని సీనియర్లు యాక్సెప్ట్ చేస్తారో లేదో చూడాలి.