మా ఎంపీని ఇక న‌మ్మలేం బాబూ.. ఏపీలో అక్క‌డ ఇదే హాట్ టాపిక్‌..?

VUYYURU SUBHASH
కొన్ని కొన్ని విష‌యాలు చిత్రంగా ఉంటాయి. రాజ‌కీయాల్లో అయితే..మ‌రింత చిత్రంగానూ ఉంటాయి. ఇప్పుడు ఇదే త‌ర‌హా ప‌రిస్థితి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురంలోనూ క‌నిపిస్తోంది. ఇక్క‌డ నుంచి వైసీపీ టికెట్‌పై గెలిచిన క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. త‌ర్వాత కాలంలో పార్టీకి యాంటీ అయ్యారు. అంతేకాదు.. పార్టీపైనా.. ప్ర‌భుత్వంపైనా ఆయ‌న విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఏకంగా ముఖ్య‌మంత్రి.. బెయిల్ ర‌ద్దు చేయాలంటూ.. కోర్టుకు వెళ్లారు. అయితే ఇన్ని చేసినా.. న‌ర‌సాపురం ప్ర‌జ‌లు ఆయ‌న‌ను ఏమీ అన‌లేదు. ఆయ‌న మీడియా మీటింగులు కూడా చూసేవారు. నిజానిజాలు ప‌క్క‌న పెట్టి.. ఆయ‌న మాట్లాడింది మొత్తం వినేవారు.

ఎంజాయ్ చేసేవారు. ఇటీవ‌ల ఆయ‌న న‌ర‌సాపురం వ‌స్తున్న‌ట్టు ప్ర‌క‌టించ‌గానే.. కొంద‌రు యువ‌త‌.. క్ష‌త్రియ సామాజిక వ‌ర్గం కూడా ఆయ‌న‌కు అనుకూలంగా ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేశారు. అయితే.. ఇప్పుడు ఇదే యువ‌త‌, ఇదే సామాజిక వ‌ర్గం.. ప్ర‌జ‌లు కూడా మా ఎంపీని న‌మ్మ‌లేం! అని మొహం మీదే అనేస్తున్నారు. అంతేకాదు.. ఆయ‌న చెప్పే మాట‌ల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు విన్నా.. ఇక వినేది లేదు! అనే స్తున్నారు. ఇది నిజం. ఇటీవ‌ల ఒక ప్ర‌ముఖ‌ మీడియా సంస్థ చేసిన స‌ర్వేలో .. ర‌ఘురామ‌ను న‌మ్మేది లేద‌ని చెప్పిన వారిసంఖ్య పెరిగిపోయింది.

దీనికి కార‌ణం కూడా వారు చెప్పారు. ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని చెప్పింది ఆయ‌నే. కానీ, ``ఆయ‌న మాట నిల‌బెట్టుకోలేదు. ఈ నెల 5నే రాజీనామా చేస్తాన‌ని చెప్పారు. క్ష‌త్రియ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు క‌నుక‌.. పౌరుషంతో అయినా.. ఆ ప‌నిచేస్తార‌ని అనుకున్నాం. కానీ, 11వ తేదీకి వాయిదా వేశారు. పోనీ.. అప్పుడైనా.. మాట నిల‌బెట్టుకుని ఉంటార‌ని అనుకున్నాం. కానీ, మ‌ళ్లీ అసలు ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెట్టేశారు.

పైగా.. జ‌గ‌న్ త‌న‌ను అన‌ర్హ‌త వేటు వేయించ‌లేన‌ని చెబితే.. చేస్తాన‌ని చెప్ప‌డం ద్వారా.. ఆయ‌న రెండు నాల్క‌ల ధోర‌ణి అవ‌లంబిస్తున్నారు. దీంతో ఆయ‌న‌ను ఎలా న‌మ్మేది ?`` అని ఇక్క‌డి వారు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి దీనికి ర‌ఘురామ ఏమంటారో.. చూడాలి. స‌ర్వే చేసిన సంస్థ టీడీపీ అనుకూల వింగ్ నుంచి పుట్టిందే కావ‌డం గ‌మ‌నార్హం.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: