జగన్ కృషి సక్సెస్.. దెబ్బకు దిగొచ్చిన కేంద్రం...!
ఎప్పటికప్పుడు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ.. జగన్.. హోదా సహా విభజన హామీలపై కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారని.. ఎంపీలు చెబుతున్నారు. తాము కూడా అవకాశం వచ్చిన ప్రతిసారీ.. పార్లమెంటులో ఆయా అంశాలను ప్రస్తావిస్తున్నామని.. కేంద్రాన్ని నిలదీస్తున్నామని అంటున్నారు. అయినప్పటికీ.. ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి హామీ.. చర్యలు లేకపోవడంతో జగన్ ఏం చేస్తున్నారనే ప్రశ్నలు సర్వత్రా వినిపించాయి. అయితే.. తాజాగా కేంద్రం కదిలి వచ్చింది. ఇటీవల పార్లమెంటులో వైసీపీ ఎంపీ.. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇదేననా మీరు చేసేది అంటూ.. నిలదీశారు. బీజేపీపాలిత రాష్ట్రాలకు ఒక న్యాయం.. మరోపార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మరోన్యాయమా? అంటూ.. విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో కేంద్రం తాజాగా దిగి వచ్చింది. కేంద్ర హోం శాఖ నేతృత్వంలో ఈ నెల 17న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విబజన సమస్యలపై చర్చించేందుకు రెడీ అయిది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించే ఈ కార్యక్రమంలో రెండు రాష్ట్రాల అధికారులు.. మంత్రులు పాల్గొనాలని తాజాగా కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతేకాదు.. ఏయే అంశాలను చర్చించనున్నారో కూడా స్పష్టం చేసింది.
అజెండా ఇదే
+ ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన
+ ఏపీ, తెలంగాణల్లో విద్యుత్ వినియోగం
+ పన్నుల విషయంలో నెలకొన్న సమస్యల పరిష్కారం
+ బ్యాంకు డిపాజిట్లు, ఇతర ఆర్థిక అంశాల విభజన
+ వనరుల సర్దుబాటు
+ ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోని ఏడు కరువు ప్రభావిత జిల్లాలకు సాయం
+ ఏపీకి ప్రత్యేక హోదా