2024లో వైసీపీకి ఇంత గడ్డు పరిస్థితా... జగన్కు ఎదురు దెబ్బ తప్పదా...!
ఇక వైసీపీ కూడా వచ్చే ఎన్నికల్లో మరోసారి బంపర్ మెజార్టీతో గెలుస్తామన్న ధీమాతో ఉంది. గత ఎన్నికల్లో గెలుచుకున్న 151 సీట్లలో ఓ 50 సీట్లు పోయినా కూడా మరోసారి తమకు అధికారానికి తిరుగులేదన్న ధీమాయే ఆ పార్టీ వర్గాల్లో ఉండేది. అయితే క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదా ? అంటే ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు.. వైసీపీ వర్గాల్లోనూ ఇదే మాట వినిపిస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 100కు పైగా నియోజకవర్గాల్లో వైసీపీ తీవ్రమైన గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందట. ఇది ఆ పార్టీ ఇంటర్నల్ టీం, పీకే టీం చేయించుకున్న సర్వేలే చెపుతున్నాయట.
అసలు తమకు తిరుగులేదని అనుకుంటోన్న టైంలో హఠాత్తుగా ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ వాళ్లు ఎంతో నమ్మే పీకే టీం తాజా రిపోర్ట్ ఇప్పటికే జగన్కు చేరినట్టు తెలుస్తోంది. ఈ సర్వేలో మొత్తం 100 స్థానాల్లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్టు తేలిందట. ఉద్యోగులకు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో పాటు ఇటు క్షేత్రస్థాయిలో అసలు అభివృద్ధి అన్న మాట లేకపోవడం... పార్టీలో గ్రూపుల గోల ఇవన్నీ ప్రభుత్వ వ్యతిరేకతకు కారణం అవుతున్నాయట.
అధికారంలో ఉన్నాము.. అనుకున్నవి చేయలేకపోయాము.. కొంత వ్యతిరేకత ఉంటుందని.. తాము అనుకున్నామని.. అంతే కాని ఇంత వ్యతిరేకత ఉంటుందని తాము ఊహించలేదని వైసీపీ అధిష్టానం కూడా షాక్ అయ్యిందట. ప్రతిపక్షాలు ఏకం కాకుండా ఉంటే మరోసారి తమదే గెలుపు అన్న ధీమాతో ఉన్నామని. అయితే ఇప్పుడు పరిస్థితి రివర్స్ అవుతోందని కూడా వైసీపీ ఇంటర్నల్ చర్చల్లో నడిచిందని తెలుస్తోంది.