మార్నింగ్ రాగా : ఆర్ట్స్ అండ్ సైన్స్..ఓ వివేకా నీకు వంద‌నం

RATNA KISHORE
ఎక్క‌డో ఆగిపోయి
అమ్మానాన్న స్మ‌ర‌ణ చేయండి
ఎక్క‌డో నేర్చుకుని
ఈ దేశానికి ఖ్యాతి ఒక‌టి ఇచ్చి వెళ్లండి
అన్య మ‌త గౌర‌వం అన్య మ‌త ప్రాభ‌వం
రెండూ కూడా మ‌న జీవితాల్లో భాగం
సంస్కృతి అంటే ప్ర‌వాహం
భాష అంటే అదొక గొప్ప స‌ముద్రం
ఉప్పునీటిని పుక్కిలించి వ‌దిలేయ‌కూడ‌దు
ఆరోగ్యం అనుకుంటే ఆ నీటి తీరాల చెంత
మ‌నం ఉండి జీవితాన్ని  కొల‌వాలి!
క‌నుక మ‌న జీవితం లో కొల‌వ‌డం సైన్సు
కొలిచి మొక్క‌డం ఆర్ట్సు...

మాన‌వ‌త‌కు జేజేలు చెప్పి నందుడ్ని స్మ‌రిస్తే
పొంగిపోయాను నేను..ఆనందించాను నేను..
జేజేలు వివేకా...అవ్య‌క్త‌మా? నాలో
తెలియ‌దు స‌ర్..ప్రేమ కాదు గొప్ప సంస్కారం
కూడా అవ్య‌క్తం అయి ఉంటుంది..సైన్సూ,ఆర్ట్సూ
ఇవే నేర్పాయి ఈ ప్ర‌పంచ గ‌తుల‌కు...

జీవితాన్ని య‌వ్వ‌నంతో, య‌వ్వ‌నాన్ని జీవితంలో న‌డిపించ‌డం, భాగం చేయ‌డం అన్న‌వి చాలా సులువు. య‌వ్వ‌నోత్సాహంలో చేసే ప‌నులు అన్నీ ఆనందాల‌కు ఆన‌వాలు అయి ఉంటాయి.య‌వ్వ‌నోత్సాహంలో గాలి త‌ర‌గ‌లు హాయిగా ఉంటాయి..సునామీ వీచిక‌లు కూడా భ‌య‌పెట్ట‌వు.అదుపూ ఆజ్ఞ లేకుండా జీవితం ఎలా అంటే అలానే ఉంటుంది. ఆ విధంగా ఉండేందుకు య‌వ్వ‌నోత్సాహాల‌కు మ‌రికొన్ని కార‌ణం అవుతున్నాయి ఇవాళ. అవును  ఇవాళ జాతీయ యువ‌జ‌న దినోత్స‌వం.. అంటే వివేకానందుని జ‌యంతి..

వైజ్ఞానిక రంగాలు అభివృద్ధి చెందిన‌ప్పుడు వాటికి మాన‌వ‌త‌ను జోడించండి అని చెప్పారు వివేకా.. చ‌దివేను నేను.. ఈ మాట 1902 (అంటే ఆయన చ‌నిపోక ముందే) చెప్పి వెళ్లారు జంషెడ్ జీ టాటాతో! భార‌త్ కు సాంకేతిక వృద్ధి కావాల‌ని, ఉంటే అది ప్ర‌పంచ శ‌క్తిగా మారుతుంద‌ని విశ్వ‌సించారు.కనుక ఈ దేశ యువ‌త ఆర్ అండ్ ఆర్ (రీసెర్చ్ అండ్ రిఫ‌రెన్స్)పై దృష్టి సారిస్తే మేలిమి ఫ‌లితాలు వ‌స్తాయి.. చెడు దారుల్లో న‌డిచే యువ‌త‌కు స్వామీ జీ ఎన్నో మంచి మాట‌లు చెప్పారు.. బోధ‌న కార‌ణంగా మ‌నిషి మారుతాడు అని అనుకోలేం కానీ కొన్ని చ‌ర్య‌లు అవ్య‌క్తం అయి ఉంటాయి. అప్పుడు బోధ‌న‌లు ప్ర‌భావితం చేస్తాయి.. ప్రాసంగిక ధోర‌ణి జీవితాన్ని మార్చేందుకు ఓ చిన్న కార‌ణం అయితే చాలు.. అప్పుడు నందుడు మీలో నాలో బుద్ధుడు మీలో నాలో!

హైద్రాబాద్ యువ‌త‌కు ఓ గొప్ప మార్గం ఉంది..ఆర్కే మిష‌న్ అని..దోమ‌ల గూడ దారుల్లో ఎంద‌రో యువ‌కుల‌కు, యువ‌తుల‌కు దారి ఇచ్చే దీప కాంతిని ప్రేమించాలి మీరు.. అప్ర‌మేయ ప్రేమ అని ఉంటుంది అంటే మీ ప్ర‌మేయం లేకుండానే ప్రేమ క‌లగ‌డం లేదా పుట్ట‌డం.. అలాంటి ప్రేమ‌కు సంకేతం ఆ దారి..ఆ సంస్థ కావొచ్చు.. సైన్సు ఆర్ట్సు రెండూ జీవ‌నాడులు మ‌న జీవితాల‌ను ప్ర‌భావితం
చేస్తాయి..మాన‌వ‌త‌ను కోరుకోని శాస్త్ర సాంకేతిక‌త వ‌ద్దు అని చెప్పిన ఆ మ‌హ‌నీయుడి పాదాల‌కు వంద‌నాలు చెబుతోంది.. ఈ
ఉద‌యం వేళ నా అక్ష‌రం. నా ప్రాసంగికిత కూడా!


- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: