ట్రోల్ వ‌ర్డ్ : తెలంగాణ పోలీస్

RATNA KISHORE
ఎదురొస్తే స‌లామ్ చేస్తాం
అన్యాయం నిలువ‌రిస్తే
నిలువెత్తు పూల‌తో స‌త్క‌రిస్తాం
నిజాయితీకి కేరాఫ్ అయితే
సంతోషించే పాదాభివంద‌నం చేస్తాం
ఆప‌ద‌లో కాపాడితే దేవుడు అని
దండం పెడ‌తాం దండ‌లు వేస్తాం
కానీ ఆ పోలీసు చీక‌టి సామ్రాజ్యానికి
స‌హ‌క‌రించాడ‌న్న‌ది ప్ర‌ధాన ఆరోప‌ణ
ఇప్పుడేం చేద్దాం.. రాఘ‌వ‌కు
స‌హక‌రించిన పోలీసులు ఎవ్వరు?
స‌జ్జ‌నార్ తేల్చాలి వీలుంటే..
వీల‌యితే.. లేదా స్టీవెన్ ర‌వీంద్ర తేల్చాలి
రాజ‌కీయ నీడ‌లు దాటి ఇలాంటి సిన్సియ‌ర్స్
సీనియ‌ర్స్ ప‌నిచేస్తే ద‌ర్యాప్తు బృందాల‌కు
నేతృత్వం వ‌హిస్తే మంచి ఫ‌లితాలు వ‌స్తాయి
అప్పుడు హ‌రీశ్ రావు, తార‌క రామారావు
దూరకుండా ఉంటే చాలు
కేసీఆర్ ఆ స్వేచ్ఛ ఇస్తారా ?
కేసుకు గ్ర‌హణం ప‌ట్టిస్తారా?

నాలుగో సింహం అంటే గౌర‌వం మ‌రియు ఇష్టం కూడా! ఇష్టం ఎలా అంటే రాత్ర‌న‌క ప‌గ‌ల‌క జనార‌ణ్యంలో నిందితుల వేట సాగించి, క‌ర్త‌వ్య దీక్ష‌ను క్ర‌మం త‌ప్ప‌క పాటిస్తారు క‌నుక‌! గౌర‌వం ఏంటంటే కంటి మీద కునుకు లేకుండా ఉన్నా సంయ‌మ‌నంతో కొన్ని స‌మ‌స్య‌లు

అయినా ప‌రిష్క‌రించి లా అండ్ ఆర్డ‌ర్ ను దార్లోకి తెస్తారు క‌నుక! ఈ రెండూ లేని రోజున తెలంగాణ పోలీసు అయినా, ఆంధ్రా పోలీసు అయినా ఒక్క‌టే..దుర‌దృష్టం ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులూ రాజ‌కీయ ఒత్తిళ్ల‌కు లొంగిపోతున్నారు. త‌లొగ్గి న‌డుచుకుంటున్నారు.ఆవిధంగా చేశాకే వ‌న‌మా రాఘ‌వ లీల‌లు బ‌య‌ట‌ప‌డ‌కుండా ఉన్నాయి.ఆయ‌న చీక‌టి సామ్రాజ్య విస్త‌ర‌ణ‌కు సెటిల్మెంట్ల‌కు,వివాహేత‌ర బంధాల‌కు, సంబంధిత అకృత్యాల‌కు అన్నింటికీ ఖాకీలే కార‌ణ‌మ‌న్న క‌థ‌నాలు మీడియాలో వ‌స్తుంటే విప‌క్షాలు ధ్రువీక‌రించ‌డ‌మే కాదు స్థానికులు కూడా ఇదే మాట ఇప్పుడు ధైర్యంగా బ‌య‌ట‌కు వ‌చ్చి చెబుతున్నారు.ఈ త‌రుణంలో కేసీఆర్ మాత్రం బాధిత ప‌క్ష‌పాతిగా ఉండాలి.. ఉంటారో లేదో అన్న‌ది ఇప్పుడిక స‌స్పెన్స్.
ఏం చేస్తున్నారు అంత‌మంది.. ఏం చేస్తున్నారు పోలీసులు అంత మంది ఉండి కూడా! ఉండి కూడా అంటే ఉన్నా లేని విధం ఒక‌టి ఉంది క‌నుక‌! ఒక రాక్ష‌సుడి అకృత్యంలో భాగం పంచుకున్న పోలీసులు ఎంద‌రు అని అడుగుతున్నారు విప‌క్ష స‌భ్యులు.బీజేపీ ప‌ట్టుబ‌డితే బాగుంటుంది వ‌న‌మా (ఎమ్మెల్యే వేంక‌టేశ్వ‌ర‌రావు) అరెస్టుకు..కానీ ఎందుక‌నో కొడుకు చుట్టూ రాజ‌కీయం న‌డుపుతోంది.ఇంత‌కాలం పోలీసులు అంటే చాలా మంచివారు..నిజాయితీ ప‌రులు..అక్ర‌మాల‌కు కొమ్ముకాయ‌రు.. వెన్ను చూప‌రు అంటూ చాలా విన్నామే కానీ అవ‌న్నీ అబ‌ద్ధాలే అని తేలిపోయింది. ఏళ్ల‌కు ఏళ్లు చీక‌టి రాజ‌కీయం న‌డుపుతున్న వ‌న‌మా రాఘ‌వ పై ఎందుకు చ‌ర్య‌లు లేవు? నాలుగో సింహం నిద్ర‌పోతుంద‌ని నిర్థారించిన విప‌క్ష స‌భ్యులు ఇప్పుడేం మాట్లాడ‌తారో ఇక‌పై ఏం మాట్లాడ‌తారో అన్న‌ది ఓ ముఖ్య విష‌యం కానుంది.  
- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి
శ్రీ‌కాకుళం దారుల నుంచి

మరింత సమాచారం తెలుసుకోండి:

trs

సంబంధిత వార్తలు: