హ్యాపీ సండే : హ‌రిత దారుల చెంత వ్య‌థలు తీరేనా! సాగు బాగు


 భారత్ కు  2022లో   ఏంటి జరగాలి అన్న విషయం ఒక్కసారి మదిలోకి తెచ్చుకుంటే ఎన్నో అసంపూర్తి సమస్యలు మన కళ్ళ ముందు కదలాడతాయి. ముఖ్యంగా రైతులు రాష్ట్రంలోనూ,  దేశంలోనూ  గడచిన  సంవత్సరమంతా పోరు బాట పట్టారు.ఇకపై ఇది ఏ మాత్రం సమంజసం కాదు. అసలు రైతులు కోరుకునేది ఏమిటి ?
ఒకసారి క్షేత్రస్థాయిలో నుంచి పరిశీలనాత్మకంగా చూద్దాం.  రైతులకు కావల్సింది వ్యవసాయ మార్కెట్ ను పారదర్శకత గా  చేయడం. నేడు  వ్యవసాయ రంగంపై ఎరువులు పురుగు మందుల భారం అధికంగా పడుతోంది. ఇది లేని ఆర్గానిక్ వ్యవసాయం పై మరింత పరిశోధన చేయడం.  ఆదిశగా రైతులను ప్రోత్సహించడం.  గ్రామీణ పథకాల సంస్కరించడం జరగాలి.  వీటన్నిటికంటే ముఖ్యం అయింది ఏమిటంటే.   పాలకులు సాగు నీటి రంగంపై దృష్టి సారించాలి.
రైతులకు... రైతులు కానివారికి, ఇంకా చెప్పాలంటే భారత్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కావలసింది ఒకే ఒకటి ఉంది. అది ఆహార ధరల పెరుగుదలను నియంత్రించడం. దీనికి పాలకులు అత్యంత అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఆహార వస్తువుల ధరలను ఆకాశానికి అందనంత దూరం పోకుండా అందుబాటులోకి తీసుకురావాలి.  చివరగా కొన్న గరిష్ట విక్రయ ధర కన్నా 5 నుంచి 6 శాతం ఎక్కువ ధరకు ప్రస్తుతం గిడ్డంగుల్లో  టన్నుల కొద్ది నిల్వ ఉన్న ఆహార ధాన్యాలను మార్కెట్లోకి తరలించాలి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ సి ఐ)) గిడ్డంగులలో ఆహార ధాన్యాలు నిల్వలు కనీసం ఐదేళ్ల పాటు సరిపడేలా భద్రపరచాలి. ఆహారధాన్యాల నిల్వలు పెంచుకునేందుకు ప్రభుత్వం కొన్ననియమాలను సడలించాల్సి ఉంటుంది. గిడ్డుంగులు నిర్మించుకునేందుకు, ధాన్యం నిల్వ చేసుకునేందుకు ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు భాగస్వామ్యం కల్పించాల్సి ఉంటుంది. అదే సమయంలో గిడ్డంగుల  నిర్మాణానికి ముందుకు వచ్చి రైతులకు సబ్సిడీ అందజేయాలి. దీనివల్ల వసతులు లేని కారణంగా ఆహార ధాన్యాలు చెడి పోకుండా నిల్వ చేసేందుకు వసతులు కల్పించినట్లువుతుంది. వ్యవసాయ ఉత్పత్తులు అన్నింటిని దిగుమతి చేసుకోవడానికి కానీ దిగుమతి చేసుకోవడానికి కానీ రైతులకు మరింత స్వేచ్ఛనివ్వాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: