జగన్ బాబులాట - ఆంధ్రప్రజ నోట్లో పెండ: అందరూ చదువుకున్నోళ్లే కదా... మీరు ఇది చదివారా ?

 గత కొంత కాలంగా  తమ గౌరవాన్ని తామే కోల్పోతున్నది ఎవరు ?  అన్నప్రశ్నకు టక్కున సమాధానం వస్తుంది.  మొదటి సమాధానం రాజకీయ నాయకులు. రెండవ సమాధానం చట్ట సభలు. ఈ రెండింటి మధ్య చాలా అవినాభ సంబంధం ఉంది. ఏ రాజకీయ నాయకుడికైనా చట్ట సభల్లో కూర్చోవాలని ఉంటుంది. ఇది లోక సహజం. చట్ట సభలు అంటే ఏమిటి ? అక్కడ ఏమి జరుగుతుంది ? ఆ  సమావేశాల్లో ఏమేమి చర్చిస్తారు ? అన్న ప్రశ్నలు సహజంగానే ఉద్భవిస్తాయి. కానీ ,  గత కొన్ని చట్ట సభల సమావేశాల్లో  సామాన్యులకి సమాధానం దొరకడం లేదు. సామాన్యులకే కాదు,  తలలు పండిన పాత్రికేయులకు, రాజకీయ విశ్లేషకులకూ కూడా ఈ ప్రశ్నలకు సమాధానం లభ్యం కావడం లేదు.
చట్ట సభల నిర్వహణ అనేది చాలా పెద్ద అంశం. సభలను సజావుగా నిర్వహించడానికి  సభ్యులతో వివిధ కమిటీలను ఏర్పాటు చేస్తారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ,  గ్రంథాలయ కమిటీ,  అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ కమిటీ ఇలా  పదహారు, పదిహేడుకు పైగా వివిధ కమిటీలున్నాయి.  అన్నింటి లోకీ ప్రధాన మైనది  సభా హక్కుల కమిటీ. ఈ కమిటీకి విశేషాధికారాలుంటాయి. రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడే చట్ట సభల్లో ఎలాంటి పదజాలం వాడాలి అనే విషయమై  పార్లమెంటరీ వర్డ్స్ అనే పుస్తకాన్ని కూడా రాజ్యాంగ నిర్మాతలు  రచించారు. ఆ పుస్తకం అప్పుడే ప్రచురితమైంది. ఆ తరువాత ఆ పుస్తకం పునర్ ముద్రితం కాలేదు.  ఇప్పటికీ  న్యూఢిల్లీ లోని పార్లమెంట్ భవనం లైబ్రరీలో ఆ పుస్తకం దీనా వస్తలో ఉంది. ఇక ఆంద్ర ప్రదేశ్  విషయానికి వద్దాం.

ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ కార్య విధానం సంపుటి అనే పుస్తకం  ఒకటుంది.  ఆంధ్ర ప్రదేశ్ వేరు పడ్డాక రూపొందించిన పుస్తకం ఇది.   ఈ పుస్తకం చాలా పెద్దదిగా ఉండదు. ఓ చిన్న హ్యాండ్ బుక్ అంతే ఉంటుంది.  దీంట్లో చట్ట సభ్యుల విధి విధానాలున్ననాయి. ఆంధ్ర ప్రదేశ్ చట్ట సభల్లో  నిరక్ష రాస్యులు ఎవరూ లేరని గతంలో  ఓ సారి  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. ఈ సభలో డాక్టర్లున్నారు. యాక్టర్లున్నారు, ఇంజనీర్లున్నారు.. పాత్రికేయులున్నారు..  గతంలో ఓ మారు అలా సాగింది వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రసంగం. అయితే ఇటీవలి కాలంలో  సభ సజావుగా సాగటం లేదనేది సుస్పష్టం.  అధికార ప్రతిపక్షాలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడంతో  సభా సమయాన్ని వృధా చేస్తున్నాయి.  ఆసక్తి కమైన విషయం ఏమిటంటే అధికార ప్రతిపక్షాలు రెండూ కూడా సమయ పాలన గురించి, సమయం వృధా కావడం గురించి గంటల తరబడి అసెంబ్లీలో ప్రస్తావనలు చేయడం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: