జగన్ బాబులాట - ఆంధ్రప్రజ నోట్లో పెండ: ఆంధ్ర ప్రదేశ్ లో రహదారుల సొగసు చూడ తరమా !


ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. రాష్ట్రాన్ని, అక్కడి ప్రజలను కన్నీటి సంద్రం లో ముంచెత్తాయి. భారీ వర్షాలకు జరిగన నష్టం అంచనా ఎంత అనేది ఇప్పుడిప్పుడే చెప్పడం కష్టం. కళ్ల ముందు కనిపిస్తున్నది మాత్రం రహదారులకు జరిగిన నష్టం. ఈ రహదారులు సొగసు చూడ తరమా అన్నంత అద్వానంగా ఉన్నాయన్నది మాత్రం సుస్పష్టం
 ప్రపంచ వ్యాప్తంగా కామన్ గా ఉండే  బద్ద విరోధులు రెండు. అవి తారు- నీరు. ఈ రెండింటికీ ఎక్కడా సరిపడదు. తారు తో వేసిన రోడ్లపై నీరు నిలబడితో .. అక్కడ గుంతలు ఏర్పడతాయి. మరీ భారీగా నీరు ప్రవహిస్తే రోడ్లు కొట్టుకు పోతాయి. నిత్య సత్యమైన ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఎవరూ తారు లేకుండా రోడ్డు వేయరు. ప్రపంచ వ్యాప్తంగా చాలా సాంకేతికత అభివృద్ధి చెందింది. ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడా ఆధునిక సాంకేతికతతో గత కొంత కాలంగా రహదారులు నిర్మించిన దాఖలాలు లేవు.
భౌగోళిక పరిస్థితుల ప్రభావం కావచ్చు. ఋతు పవనాల ప్రభావం కావచ్చు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతి ఏడాది ఏదో ఒక ప్రాంతంలో  విడతల వారీగా వర్షం పడుతుంది. అప్పడు నష్టపోయోది మాత్ర రహదారులే.  మనకు పైకీ దెబ్బతిన రోడ్లు కనిపిస్తాయి. అని ప్రత్యక్షంగా కనిపించే నష్టం మాత్రమే. కనిపించని నష్టం చాలా ఉంది. ఆ రహదారి పై వెళ్లాల్సిన ప్రజలు, తిరగాల్సిన వాహనాలు,  రవాణా కావల్సిన సరుకులు,  ఎలా ఎన్నో.. ఎన్నెన్నో.. మరీ మఖ్యంగా రైతు స్వేదంతో పండించిన పంటలు కూడా రహదారుల మీదుగానే పట్నం చేరాలి.  ఈ రోడ్లు మన మాన ప్రాణాలకు ప్రత్యక్ష సాక్షి.


 ఆంధ్ర ప్రదేశ్ లో జాతీయ రహదాల విషయం కాస్త పక్కకు పెడదాం. రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో రాష్ట్ర రహదారులున్నాయి. వాటిని స్టేట్ హైవేలు (ఎస్.హెచ్) గా పేర్కోంటారు. అధికారిక గణాంకాల ప్రకారం  14,77 పైచిలుకు కిలోమీటర్ల దూరం రాష్ట్ర ప్రభుత్వ ఏలుబడిలోనివే. వాటి బాబోగులు చూడాల్సిన బాధ్యత సాక్షాత్తు  రాష్ట్ర ప్రభుత్వానిదే. ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కువ పొడవైన రాష్ట్ర రహదారి ఎస్.హెచ్ 31.. కడప- రాజంపేట- కోడూరు- రేణిగుంట రోడ్డు. ఈ రహదారి లో కొంత భాగం జాతీయ రహదారి క్రిందకు వస్తుంది. ఇటీవలి వర్షాలకు ఈ రోడ్డు అతలాకుతలం అయింది.  రాకపోకలు స్థంభించాయి. చాలా ప్రాంతాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అధికారులు రోడ్లకు మరమ్మతు చర్యలు చేపడుతున్నారు. అవి తాత్కాలిక మరమ్మతులే.  కేవలం రవాణాను పునరుద్దరించ డానికే.  శాశ్వత పరిష్కారం చూపే దెన్నడు ?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: