భారతీయుల నయా డిమాండ్ ఏమిటి ?


కొద్ది నెలల క్రితం చైనా వస్తువులు, యాప్ ను నిషేధించిన భారత్ త్వరలో మరో దేశంపై ఆంక్షలు విధించ నుంది. అది కూడా భారత్ కు ఇప్పటి వరకూ మిత్రదేశం బంగ్లాదేశ్ పై.  ఆ దేశంలో వరస వెంబడి హిందూ  ధార్మిక సంస్థలపై దాడులుజరుగుతున్నాయి.  అదే సమయంలో బంగ్లాదేశంలోని హిందువులకు మద్దతుగా భారత్ లోనూ ర్యాలీలు జరుగుతున్నాయి. దీంతో  బి.జె.పి పాలిత కేంద్ర ప్రభుత్వం పై హిందూ సంస్థలను ఒత్తిడి పెరుగుతోంది. విదేశీ వ్యవహారాలను చక్కబెట్టడంలో  మహా మేథావిగా పేరుగాంచిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి ఇది పెద్ద అగ్ని పరీక్ష.
|ఈ ఏడాది అక్టోబర్ 13న అంటే హిందువులు పరమ పవిత్రంగా పూజలు చేసే దుర్గా నవరాత్రుల సమయం లో  హిందూ ముస్లిం మధ్య వివాదం ఏర్పడింది.  బంగ్లాదేశ్  దేశం ఢాకా సమీపంలోని కొమిల్లా జిల్లాలో  నవరాత్రి ఉత్సవాలు జరుగుతుండగా ఈ ఘటన జరిగింది.  అక్కడ కొందరు ముస్లింలు ఖురాన్ తీసుకు వచ్చి  పూజా  ప్రాంతంలో ఉంచారు. దీంతో అక్కడ చిన్న వివాదం మొదలైంది.   ఆ దేశం లో హిందూ సంస్థలు, దేవాలయాలపై దాడులు ఆరంభమయ్యాయి. ఈ క్రమంలో  ఇస్కాన్ మందిరాన్ని   కొందరు కూలగొట్టారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా అగ్గి రాజేసింది. ఇస్కాన్ సంస్థకు అంతర్జాతీయంగా కేంద్రాలు ఉండటంతో  ప్రతి దేశంలో నూ   ఇస్కాన్ కు చెందిన కృష్ణ భక్తులు ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు చేశారు.  బంగ్లాదేశ్ కు సమీపంలో ఉన్నఉత్తర భారతదేశం లోనూ ఈ ఘటన ఒక కుదుపు కుదిపింది. అస్సాం, పచ్చిన బంగాల్, మిజోరాం తదితర రాష్ట్రాలలో నిత్యం ర్యాలీలు జరుగుతున్నాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పై హిందుత్వ సంస్థలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి.  విదేశాలలో నివశిస్తున్న హిందువుల రక్షణకు ఎలాంటి  చర్యలు తీసుకున్నారో తెలపాలని హిందూ సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. హిందూ సంస్థల అండదండలు పరోక్షంగా భారతీయ జనతా పార్టీ కి ఉండటంతో  ఆ పార్టీ ఇప్పుడు ఇరుకున పడింది. చైైనా దేశం పై  ఆంక్షలు విధించినట్లుగా నే బంగ్లాదేశ్ పైనా ఆంక్షలు విధించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి  హిందూ సంస్థలు విజ్ఞప్తి చేశాయి.   బంగ్లాదేశ్ లోని హిందువులకు మద్దతుగా భారత్ లో జరుగుతున్న ఆందోళనలు అన్నీ కూడా పోరుగుదేశం నుంచి ఎలాంటి సహాయం పొందరాదని డిమాండ్ చేస్తున్నాయి. అక్కడి వస్తువులను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: