సెంట్రల్ క్వశ్చన్ - ఏపి సైలెంట్
సెంట్రల్ క్వశ్చన్ - ఏపి సైలెంట్
కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కొన్ని అంశాలపై వివరణ కోరింది. దీనిపై ఏ. పి ప్రభుత్వం నుంచి స్పందించ లేదు ఇదీ తాజాగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వాదన. ఆంధ్ర ప్రదేశ విభజన చట్టంలో ని పలు అంశా ల అమలు జాప్యం కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు లిఖిత పూర్వకంగా సమాధానాలు ఇచ్చాయి. నౌకాయాన శాఖ, ఉక్కు శాఖలు ఇచ్చిన సమాధానం ఏదయినా సారాంశం మాత్రం ఒక్కటే
ఎంత మంది పోరాటం చేశారో.... మరి వారి పోరాటాలు మధ్యలో నే ఎందుకు ఆగిపోయాయి. పోరుబాటను పక్కన పెట్టడం వెనుక ఎం జరిగింది ? ఎం జరుగుతోంది ? ఇవన్నీ నెల్లూరు జిల్లా తీరప్రాంత ప్రజల మదిలో నిత్యం వస్తున్న ప్రశ్నల పరంపర. దీని పై ఎవరూ సమాధానం చెప్పరు. నెల్లూరు జిల్లా కృష్ట పట్నం లో నూతనంగా ప్రైవేటు పోర్టు ఏర్పాటు చేసి తరువాత ఓ డిమాండ్ వచ్చింది. కృష్ణపట్నం పోర్టు ఏర్పాటుకు వ్యతిరేకం కాదంటూనే పలు రాజకీయ పక్షాలు ఇదే జిల్లా పరిధిలోని దుగరాజపట్నం కేంద్రంగా పోర్టు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వివిధ రాజకీయ పక్షాలు ఈ డిమాం డ్ ను ఆసరా గా చేసుకుని విచిత్ర విన్యాసాలతో ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేశాయి. కాంగ్రెస్ హయాంలో చక్రం తిప్పిన మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ దుగరాజపట్నంలో పోర్టు ఏర్పాటు చేయాలని నిరసన కార్యక్రమాలు చేశారు. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు వైాఎస్ ఆర్ కాంగ్రెస్ నేత వరప్రసాద్ రావు తిరుపతి పార్లమెటు సభ్యుడిగా ఉన్న సమయంలో ఏకంగా నిరాహార దీక్ష చేశారు. ప్రస్తుతం ఆయన గూడూరు ఎం.ఎల్.ఏ. దుగరాజపట్నం ఈయన నియోజకవర్గం లోనే ఉంది. వర ప్రసాద్ రావు ఎం.ఎల్.ఏ అయిన తరువాత దుగరాజపట్నం ప్రస్తావన చేయలేదని వై.సి,పి నాయకులే పేర్కొంటున్నారు.
తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి దుగరాజపట్నం విషయంలో ఏలాంటి ప్రతి పాదనలు రాలేదని కేంద్ర ప్రభుత్వం లిఖిత పూర్వకంగా తెలిపింది. ప్రత్యామ్నాయ నిర్మాణాల పైకూడ తమకు ఎలాంటి లేఖలూ ప్రభుత్వం నుంచి రాలేదని వివరించింది. ఇదే రాష్ట్రంలోని రామాయ పట్నం కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేయతగిన పోర్టుల జాబితాలో లేదని తెలిపింది. రామాయపట్నం పోర్టును అవసరం అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం స్వంత నిధులతో ఏర్పాటుచేసుకోవచ్చని కేంద్ర జల వనరుల శాఖ మంత్రిత్వ విభావం తెలి పింది. సమాచార హక్కు చట్టం క్రింద సామాజిక కార్యకర్త రవి కుమార్ అడిన ప్రశ్నలకు మంత్రిత్వ శాఖల నుంచి సమాధానాలు వచ్చాయి. వాటిని ఆయన మీడియాకు తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా హామీలు ఆంధ్ర ప్రదేశ్ లో అమలు కావడం లేదని ఆయన సమాచార హక్కు చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరగా పలు ఆసక్తి కరమైన విషయాలు వెలుగు చూశాయి. కడపలో ఉక్కు కర్మాగారం విషయంలోనూ జాప్యం జరగడానికి టాస్క్ ఫోర్స్ కారణమని ఉక్కు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏపిలో ఉక్కు కర్మాగారాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని, ఈ అంశాన్ని లోతుగా పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో విజ్ఞప్తి చేసింది. ఈ క్రమలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది. ఆ కమిటీ ఇంత వరకూ నివేదిక ఇవ్వలేదు. విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలు లో రెండు ప్రాధాన అంశాలపై ప్రభుత్వాలు నిర్లిప్లంగా వ్యవహరిస్తుండటంతో ప్రత్యామ్నాయం ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది.