స్మ‌ర‌ణ : విశ్వ న‌రుడిని నేను

RATNA KISHORE
స్మ‌ర‌ణ : విశ్వ న‌రుడిని నేను
సంద‌ర్భం : జాషువా వ‌ర్థంతి
ఆకాశ వీధుల్లో వినిపించే శ‌బ్దం
ఏమ‌యి ఉంటుంది
ఇది క‌వి ధ్వ‌ని అని రాయాలి
కాకుల‌న్నీ ఎగిరిపోతాయి
చివ‌రికి మిగిలే కొన్ని కోయిల‌ల‌కూ
ఏం చేయాలో తోచ‌దు
వ‌సంతాలు కొన్ని అంట‌రానివి అవుతాయి
అప్పుడు మాత్ర‌మే క‌వి స్పందించాలి
యుగ క‌వి  జాషువా అని రాయొచ్చు త‌ప్పేం లేదు
వారికి నివాళులు...
రాజ‌కీయం సామాజిక స‌మీక‌ర‌ణాల్లో కొట్టి మిట్టాడి ఒంటి స్తంభ‌పు దీపాల్లో వెలుగుతున్న వేళ‌ల్లో జాషువా లాంటి  ఉత్త‌మ శ్రేణి క‌వి...క‌విత్వం ఒక‌టి వెలుగు చూడాలి. కేవ‌లం ఇవి పుస్త‌కాల‌కు ప‌రిమితం చేస్తే మ‌నం సంస్క‌ర‌ణ వాదంలో లేని వారం అయిపోతాం.. మ‌నం జీవితాల‌ను ఎవ‌రికో తాక‌ట్టు పెట్టి అభ్యుద‌యం అనో మ‌రొక‌టి అనో మాట్లాడి పోతున్నాం.. జీవ‌క‌ళ‌లు వెలువ‌రించే శిల్పుల‌ను వ‌దిలేస్తున్నాం కేవ‌లం విగ్ర‌హారాధ‌న‌లో కొన్ని మంచి విషయాల‌ను వదిలిపోతున్నాం అని అంటారు జాషువా.. మ‌నుషుల్లో ఒక్క‌టి భావ‌న ఉండ‌ద‌ని అంటారు.. అది లేన‌ప్పుడు సాహిత్యం చేసే కృషి ఫ‌లిస్తుందా.. ఇవాళ ఆయ‌న వ‌ర్థంతి .. మంచి ఏదో కొంచెం మిగిలి ఉంటే అది నేను అవుతాను అని ఎవ్వ‌ర‌యినా అంటున్నారా.. మంచికే కాదు మాన‌వ‌త్వ పోక‌డ‌ల‌కూ ప్ర‌తినిధులుగా  నిలిచే వాళ్లు ఇప్పుడు లేరు.. మ‌న సినిమాలు ఆ ప‌ని చేయ‌వు. మ‌న సాహిత్యం ఆ వ‌రకూ వెళ్ల‌దు వెళ్లినా కొన్ని వ‌ర్గాల‌కే అది ప‌రిమితం.. దేవుడు మ‌తం సాహిత్యం ఇంకా ఇంకొన్ని చేరువ కావాల్సినివి ఎన్నో ...
కొన్ని సినిమాలో కొన్ని పుస్త‌కాలో కొన్ని వ్యాసాలో ఇవాళ స్మ‌రించిన తీరు.. ఇవాళ విస్మ‌రించిన తీరు కూడా గ‌మ‌నించాలి మ‌నం.అన్నింటినీ గ‌మ‌నిక‌లో తీసుకుంటే జాషువా అన్నింటినీ గ‌మ‌నిక‌లోకి తీసుకుంటే మ‌నం ప్ర‌ద‌ర్శించే వివ‌క్ష లేదా ప‌క్ష‌పాత ధోర‌ణి అన్న‌వి తేలిపోతాయి.. విశ్వ‌న‌రుడను నేను అన్న మాట మ‌రొక్క‌సారి మ‌న లోగిలికి ప‌రిచయం అవుతుంది.. మ‌న క‌ల‌ల‌కు కాపలా ఎవ‌ర‌న్న‌దీ తేలిపోతుంది .. అన్నీ అథ‌మం అయి ఉన్నాయి.. త‌క్కువ స్థాయి ఆలోచ‌న‌ల వల్ల‌నే జాతి ఓడిపోతుంది.. త‌క్కువ స్థాయి ప‌నుల వ‌ల్ల ఓడిపోతుంది.. కానీ ఇప్ప‌టికీ మ‌నం చేస్తున్న‌దే ఇది.. ఇప్ప‌టికిప్పుడు వ‌చ్చే మార్పు ను ఆశించ‌లేం కానీ క‌విని స్మ‌రించే వేళ సంస్క‌ర‌ణ వాదం కావాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: