హెరాల్డ్ ఎడిటోరియల్ : రజనీ బ్యాక్ స్టెప్పుకు ప్రధాన కారణం ఇదేనా ?

Vijaya
డిసెంబర్ 31వ తేదీన పార్ట పెడతానని, విధి విదానాలు ప్రకటిస్తానని ఆమధ్య ప్రకటించిన రజనీకాంత్ హఠాత్తుగా పొలిటికల్ ఎంట్రీ నుండి బ్యాక్ స్టెప్ వేసిన విషయం అందరికీ తెలిసిందే. రజనీ నిర్ణయం మార్చుకోవటానికి ప్రధానంగా నాలుగు కారణాలున్నాయట. మొదటిది షెడ్యూల్ ఎన్నికలకు గడువు ఉన్నది కేవలం ఐదు నెలలు మాత్రమే. రెండోది అనారోగ్య సమస్యలు. మూడోది వయసు మీరిపోవటం. రజనీకి ఇపుడు 70 ఏళ్ళు. ఇక వీటిన్నింటితో పాటు కీలకమైన కారణం ఏమిటంటే సర్వే రిజల్టు. అవును తాను పొలిటికల్ ఎంట్రీ ఇవ్వటం, పార్టీ పెట్టడం, ఎన్నికల్లో పోటీ చేయటం తదితర అంశాలపై రజనీ సర్వే చేయించుకున్నారట. ఆ సర్వేలో జనాల నుండి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చినట్లు సమాచారం. ఇంత వయసులో, తీవ్ర అనారోగ్య సమస్యలతో ఉన్న రజనీ అసలు పార్టీ ఎందుకు పెడుతున్నారంటూ జనాలు ఆశ్చర్యపోయారట.




అసలు రజనీ పొలిటికల్ ఎంట్రీపై తమకు ప్రత్యేకంగా ఆసక్తి ఏమీ లేదని కూడా జనాలు తేల్చేశారట. దశాబ్దాల పాటు సినిమాల్లో కొనసాగుతున్నా సమాజానికి రజనీ చేసిందేముంది అని ఎదురు ప్రశ్నించారట. ఇఫ్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చి రజనీ చేసేదేముంటుంది ? అని జనాలు తేల్చేశారట. ఆయన పార్టీ పెడితే తాము ఓట్లేయాల్సిన అవసరం ఏమిటి ? వేసినా ఉపయోగం ఏమిటి ? అని జనాలు సర్వే సంస్ధనే ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. అంటే జనాలభిప్రాయం ప్రకారం చూస్తే మహా అయితే రజనీ పార్టీ తరపున ఓ 20 మంది ఎంఎల్ఏలు గెలిస్తే అదే చాలా గొప్పని జనాలు అభిప్రాయపడ్డారట. సినిమా షూటింగ్ కారణంగా రజనీ హైదరాబాద్ లో ఉన్నపుడు సర్వే రిపోర్టు అందిందట. దాన్ని ముందుగా కూతుర్లు ఐశ్వర్య, సౌందర్యలే చదివారట. ఆ తర్వాత ఇదే విషయాన్ని రజనీ భార్య లత, అల్లుడు ధనుష్ తో కూతుర్లిద్దరు చర్చించారట.




అంటే రజనీ చెన్నై చేరుకునే సమయానికే పెట్టబోయే పార్టీ పై కుటుంబసభ్యుల్లో ఓ క్లారిటి వచ్చేసింది. అందుకనే అందరు కలిసి పొలిటికల్ ఎంట్రీకి వ్యతిరేకంగా రజనీకి ఫుల్లుగా క్లాసు పీకినట్లు సమాచారం. దాంతో వయస్సయిపోవటం, అనారోగ్య సమస్యలు, సర్వే రిపోర్టులోని వివరాలు అన్నీ కలిసి రజనీని బ్యాక్ స్టెప్ వేయించిందని అర్దమైపోతోంది. అయితే సర్వే రిపోర్టు విషయాన్ని ప్రస్తావిస్తే అభిమాన సంఘాల నేతలు ఒప్పుకోరు. అందుకనే, వయస్సయిపోవటం, అనారోగ్యాన్ని ప్రదానంగా ప్రస్తావించినట్లు అర్ధమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: