ఎడిటోరియల్ : అనుమానాస్పద రాజకీయం ? పవన్ ఎందుకిలా ?

రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు విలువలు విశ్వసనీయత చాలా ముఖ్యం. తాము ఒక మాట అన్నాము అంటే,  దానికి కట్టుబడి ఉంటాము అని భరోసా కిందిస్థాయి పార్టీ నాయకులకు, ప్రజలకు భరోసా కల్పించాల్సిన అవసరం పార్టీలకు , పార్టీల అధినేతలకు తప్పనిసరిగా ఉంటుంది. కానీ తరచుగా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తూ అనుమానాస్పదంగా వ్యవహరిస్తే,  జనాల్లో చులకన అవ్వడమే కాకుండా , ఇప్పటికీ రాజకీయంగా కోలుకోలేని విధంగా ఎన్నో ఎదురు దెబ్బలు తినాల్సి ఉంటుంది అనేదానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక నిదర్శనంగా కనిపిస్తున్నారు.




 2019 ఎన్నికల తర్వాత ఘోరంగా పవన్ , ఆయన పార్టీ ఓటమి చెందింది. అప్పటి నుంచి ఆయన పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టి ప్రజలలో బలం పెంచుకుని, తన సత్తా చూపిస్తూ,  రాజకీయాలు చేస్తారని అంతా భావించగా , పవన్ మాత్రం ఆ విధంగా వ్యవహరించకుండా, ఎప్పటికీ అనుమానాస్పదంగా రాజకీయాలు చేస్తుండటంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2014 ఎన్నికల సమయంలో టీడీపీకి మద్దతు ఇచ్చిన పవన్ 2019 ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేశారు. అయినా సరే టిడిపికి లబ్ధి చేకూరే విధంగా వ్యవహరిస్తున్నారు అనే అనుమానాలు జనాల్లో కలిగిస్తూనే వస్తున్నారు. కేవలం టీడీపీకి మేలు చేసే విధంగానే పవన్ పోరాటాలు ప్రసంగాలు ఉన్నట్లుగా ప్రత్యర్థులు విమర్శలు చేయడమే కాకుండా,  జనాల్లో నూ ఆ తరహా అభిప్రాయాలు కలిగే విధంగా పవన్ వ్యవహరిస్తున్నట్లు గా కనిపిస్తున్నారు. 




ప్రస్తుతం పొత్తు పెట్టుకున్న బీజేపీ తొనూ  పవన్ ఇదే రకంగా వ్యవహరిస్తున్నారు. అసలు ఆ పార్టీతో పొత్తు ఉందా లేదా అనే విషయం అందరికీ అనుమానం కలిగే విధంగా చేస్తున్నారు. ఇలా ప్రతి దశలోనూ పవన్ వ్యవహరిస్తున్న తీరు విమర్శల పాలవుతోంది.  ఈ విషయం పవన్ కు తెలిసినా తన వైఖరిని మార్చుకోక పోగా,  అదేవిధంగా ఇప్పటికీ వ్యవహరిస్తూ,  రాజకీయంగా మరింతగా అభాసుపాలు అవుతున్నట్లు గానే పవన్ హరిస్తున్న తీరు వ్యక్తిగతంగా ఆయనకు,  జనసేన కు కూడా తీరని నష్టాన్ని చేకూరుస్తుంది అనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: