సొంతంగా పార్టీ స్థాపించడమే కాకుండా ఆ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే క్రమంలో జగన్ ఎన్ని కష్టాలు నష్టాలు అవమానాలు అనుభవించారో వైసీపీ నాయకులతో పాటు జనాలకు తెలియంది ఏమి కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన తర్వాత జగన్ ఒంటరిగానే పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. బలమైన తెలుగుదేశం పార్టీని ధైర్యంగా ఎదుర్కొని, ప్రజల్లో నమ్మకాన్ని సంపాదించుకుని జగన్ అధికారంలోకి వచ్చారు. అలా వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జగన్ సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ, ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలను ప్రకటించుకుంటూ వస్తున్నారు.
కేవలం ఐదేళ్ళ కు తన పరిపాలన పరిమితం కాదని, ఆ తర్వాత కూడా
వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉండాలి అనే విధంగా
జగన్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు.అయితే
జగన్ తనను సొంత
పార్టీ నేతలే అర్థం చేసుకోనట్టు గా వ్యవహరిస్తున్నారు. నిత్యం అనేక వివాదాల్లో తలదూర్చి
పార్టీ అధిష్టానానికి తలనొప్పులు తీసుకు వస్తున్నారు. ఈ వ్యవహారాలన్నీ పార్టీకి ఎప్పటి నుంచో డ్యామేజ్ తీసుకు వస్తూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్ర
వడ్డెర కార్పొరేషన్ చైర్ పర్సన్ దేవళ్ల
రేవతి గుంటూరు కాజా టోల్ గేట్ వద్ద పంపలేదని, టోల్ సిబ్బందిపై దౌర్జన్యానికి దిగడం భారీకేట్లు విసిరి కొట్టడం, అక్కడ పనిచేస్తున్న సిబ్బందిపై దాడికి దిగడం వంటి వ్యవహారాలన్నీ
మీడియా, సోషల్ మీడియాలో హైలెట్ అయ్యాయి. దీనిపై టోల్ గేట్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ వ్యవహారంలో ఆమెకు ,పార్టీకి చాలా డ్యామేజ్ జరగడంతో ఆమె ఎదురుదాడికి దిగినా, అప్పటికే
వైసిపి అనేక రకాల విమర్శలను ఎదుర్కొంది. ఆమెను ఆ పదవి నుంచి వెంటనే తొలగించాలి అంటూ సోషల్ మీడియాలో
వైసీపీ శ్రేణులు సైతం డిమాండ్ చేస్తుండడం వంటి వ్యవహారాలతో
జగన్ సైతం ఆమె విషయం లో చాలా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే చాలాచోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తుండడంతో అంతిమంగా
జగన్ ఆశయం నెరవేరక పోగా, నేతల వ్యవహార శైలి కారణంగా
జగన్ తీరని నష్టాన్ని చూడాల్సి వస్తోంది. ఈ వ్యవహారాలన్నీటి పైన హడావుడి చేసి రాజకీయంగా పైచేయి సాధించేందుకు
వైసీపీ రాజకీయ ప్రత్యర్ధులు కాచుకుని కూర్చున్నారు.