హెరాల్డ్ ఎడిటోరియల్ : మోడికి ముందున్నదంతా కష్ట కాలమేనా ?

Vijaya
ముందు ముందు నరేంద్రమోడి సర్కార్ కు ఉన్నదంతా కష్ట కాలమేనా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన ఆరేళ్ళల్లో మోడికి ఈ స్ధాయిలో ప్రతిఘటన ఎదురుకాలేదన్నది వాస్తవం. కేంద్రప్రభుత్వం కొత్తగా చేసిన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా పంజాబులో మొదలైన రైతుల ఆందోళన తర్వాత హర్యానాకి పాకింది. తర్వాత మహారాష్ట్రలో రైతులు చేయి కలిపారు. తర్వాత కేరళ, కర్నాటకలో కూడా గొంతు కలిపారు. తాజాగా పశ్చిమబెంగాల్, రాజస్ధాన్ రైతులు కూడా నిరసనల్లో  గొంతులు కలిపారు. ఇదంతా చూస్తుంటే యావత్ దేశంలోని రైతాంగమంతా మోడికి వ్యతిరేకంగా తయారయ్యేట్లుంది. ఎందుకంటే నెల రోజుల క్రితం మొదలైన ఉద్యమం గడచిన 15 రోజులుగా ఢిల్లీ శివార్లలోనే జరుగుతోంది. దశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకించి పంజాబ్, హర్యానా, మహారాష్ట్రలకు చెందిన రైతులు వేలాదిమంది వచ్చి క్యాంపు వేశారు. మోడి చేసిన చట్టాలు అంబానీలు, అదానీలకు తప్ప మామూలు రైంతాగానికి ఏ విధంగాను ఉపయోగపడేవి కావన్నది రైతు సంఘాల ఆందోళన.




ప్రభుత్వ యాంగిల్లో చూస్తే రైతులకు మేలుచేసే చట్టాలు రైతుల యాంగిల్లో మాత్రం ఎందుకు ఇబ్బందులు కలిగించేవిగా కనబడుతున్నాయి ? నిజంగానే కొత్త చట్టాలు రైతులకు మేలు చేసేవే అయితే అదే విషయాన్ని ఇన్నిరోజులు కేంద్రప్రభుత్వం రైతుసంఘాలతో చర్చించి ఎందుకు కన్వీన్స్ చేయటానికి ప్రయత్నించలేదు ? రైతుల ఆందోళనతో వేడి బాగా రాజుకున్న తర్వాత మాత్రమే కేంద్రం రైతు సంఘాలతో చర్చలంటు దిగొచ్చింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించలేదు. అలాగే అధికారంలో ఉన్న ప్రభుత్వం తర్వాత ఎన్నికల్లో దెబ్బతిన్న ఘటనలు కూడా మనదేశంలో చాలానే ఉన్నాయి. ఇపుడు మోడి సర్కార్ కు కూడా ఇటువంటి సత్కారం తప్పదా అనే అనుమానాలు మొదలైనాయి.




పంజాబ్, హర్యానా, మహారాష్ట్రలో మొదటి నుండి రైంతు సంఘాలు చాలా బలమైనవే. అలాగే రాజస్ధాన్, పశ్చిమబెంగాల్ లో కూడా రైతులు గట్టిగానే ఉంటారు. వచ్చే ఏడాది పశ్చిమబెంగాల్లో ఎన్నికలున్నాయి. సరిగ్గా ఎన్నికలకు ముందు ఉత్తరాధిలో మోడి సర్కార్ పై రైతుల్లో ఆందోళనలు మొదలయ్యాయి. ప్రస్తుతానికి ఉత్తరాధిలోని రైంతాంగం మొత్తం మోడికి వ్యతిరేకంగా రోడ్లపైకి రానప్పటికీ లోలోపల మండిపోతున్నారన్నది వాస్తవం. ఎందుకంటే దేశంలో ఏ మూల రైతులకు నష్టం జరిగినా అది మిగిలిన ప్రాంతాలకు పాకటానికి ఎంతో కాలం పట్టదు. కాబట్టి ఉద్యమం చేస్తున్న రాష్ట్రాల్లోని రైతులకు మాత్రమే కాదు నష్టం జరిగేది రోడ్లపైకి రాని రైతులకు కూడా నష్టమే. కాబట్టి ఎలా చూసుకున్నా సవరణల పేరుతో రైతులను కేంద్రం మభ్యపెట్టేకన్నా వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్లు కొత్త చట్టాలను రద్దు చేస్తేనే వాళ్ళు ఉద్యమం ఆపుతారు. లేకపోతే జరగబోయే నష్టానికి మోడికి సిద్దంగా ఉండాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: