హెరాల్డ్ ఎడిటోరియల్ : భారత్ కు వ్యతిరేకంగా డ్రాగన్ ఎంత పనిచేస్తోందో చూశారా ?

Vijaya
మనదేశంలో వాతావరణం ప్రశాంతంగా ఉంటే ఇటు దాయాది దేశం పాకిస్దాన్ కు అటు డ్రాగన్ దేశం చైనాకు ఏమాత్రం రుచించటం లేదు. అందుకనే ప్రత్యక్షంగా మన సైన్యాలను ఏమీ చేయలేని పై దేశాలో వెనుకనుండి గొయ్యి తవ్వే పనికి దిగాయట. ఇందులో బాగంగానే భారత్ లోని ఈశాన్య రాష్ట్రాల్లోని తిరుగుబాటుదారులకు అవసరమైన శిక్షణ, ఆయుధాలను అందిస్తోందంటు తాజాగా ఇంటెలిజెన్స్ అధికారులు సమాచారం ఇచ్చారు.  ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం  తమకు స్వాతంత్ర్యం కావాలంటు ఈశాన్య రాష్ట్రాలు కొన్ని దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నాయి. అంటే ఇక్కడ రాష్ట్రాల్లోని ప్రజలు డిమాండ్ చేయటం లేదు. కొన్ని రాష్ట్రాల్లోని వేర్పాటువాదులు మాత్రమే అలజడులు సృష్టిస్తున్నారు. అయితే కేంద్ర బలగాల ముందు వీరి పప్పులుడకటం లేదు. అందుకనే వేర్పాటువాదుల్లో కొందరిని గుర్తించిన చైనా ప్రభుత్వం మెల్లిగా వాళ్ళకు బిస్కెట్లేసి చేరదీస్తోందని సమాచారం.




వేర్పాటువాదుల్లో కొందరిని చేరదీసి తమ దేశంలోకి తీసుకెళుతోందట. అక్కడ వాళ్ళకి ఆధునిక ఆయుధాలను ఉపయోగించటంలో శిక్షణ ఇవ్వటంతో పాటు భారీ ఎత్తున ఆయుధాలను కూడా అందిస్తోందట. చైనా ఆర్మీలోని ప్రస్తుత, రిటైర్ అయిన కొందరు కీలక అధికారులు వీళ్ళకు శిక్షణ ఇస్తున్నట్లు బయటపడింది. చైనా-మయున్మార్ సరిహద్దుల్లోని ప్రాంతంలో రెబల్స్ కు డ్రాగన్ ఆశ్రయం కల్పించిందట. మయున్మార్ లోని సాయుధ సంస్ధలు యునైటెడ్ వా స్టేట్ ఆర్మీ, ఉగ్రసంస్ధగా ప్రచారంలో ఉన్న అరాకీన్ ఆర్మీ లను బీజింగ్ తన తరపున వాడుకుంటోంది. ఇపుడు వాటి ద్వారానే మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లోని వేర్పాటు వాదులను చేరదీస్తోందని సమాచారం. ఇప్పటికే ఒకవైపు పాకిస్ధాన్ తోను మరోవైపు డ్రాగన్ సరిహద్దుల్లోను వివాదాలతో భారత్ సైన్యం ఇబ్బందులు పడుతోంది. ఇటువంటి సమయంలో వేర్పాటువాదులకు ఆయుధాలనిచ్చి వాళ్ళను చైనా రెచ్చగొడుతోందంటు ఇంటెలిజెన్స్ పక్కా ఆధారాలతో సమాచారాన్ని అందించింది.




భారత్-మయున్మార్ సరిహద్దులో కూడా గొడవలు రేపటం ద్వారా మన సైన్యాన్ని ఇబ్బందులకు గురిచేయాలన్నది డ్రాగన్ పన్నాగమని మన ఇంటెలిజెన్స్ పసిగట్టింది. ఈమధ్యనే మయున్మార్ సరిహద్దుల్లో ముగ్గురు సాయుధులను మన సైన్యం అదుపులోకి తీసుకుని విచారించింది. ఈ విచారణలో వెల్లడైన వివరాలతో మన సైన్యాధికారులు షాక్ తిన్నారట. సరిహద్దుల్లో అలజడలు సృష్టించేందుకు అరాకన్ ఆర్మీని అడ్డంపెట్టుకుని చైనా చేస్తున్న కుట్రలు బయటపడటంతో సైన్యం అప్రమత్తమైంది.  దాంతో మయున్మార్ సరిహద్దులో కూడా భారీగా సైన్యాలను తరలిస్తోంది. వివాదాలు రేపడం తర్వాత వాటితో తమకు సంబంధం లేదని బుకాయించటం చైనాకు అలవాటే. ఇపుడు కూడా భారత్ అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోవటం లేదంటూ వాదిస్తోంది. భారత్ లోని రెబల్స్ కు సాయం చేయాల్సిన అవసరం తమకు లేదని బుకాయిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: