సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బాబ్డేకు జగన్మోహన్ రెడ్డి చేసిన ఫిర్యాదుపై దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోందా ? అవుననే అంటున్నారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. సుప్రింకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ+హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరితో పాటు మరో ఆరుగురు జడ్జీలపై జగన్ బాబ్డేకి లేఖరూపంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబునాయుడు ప్రయోజనాలే లక్ష్యంగా వీళ్ళంతా ప్రభుత్వ వ్యతిరేక వైఖరిని అవలంభిస్తున్నట్లు జగన్ తన లేఖలో ఆరోపణలు చేశాడు. తన ఆరోపణలకు ఆధారాలుగా కొన్ని ఘటనలను కూడా ఉదహరించాడు. జగన్ చేసిన ఫిర్యాదు బయటపడగానే దేశంలో పెద్ద సంచలనమైంది.
జగన్ ఫిర్యాదు బయటకు రాగానే చంద్రబాబు+ఎల్లోమీడియా మొత్తానికి దిమ్మతిరిగిపోయింది. ఎందుకంటే న్యాయవ్యవస్ధలోని ప్రముఖులపై జగన్ ఫిర్యాదు చేస్తాడని వీళ్ళు ఊహించలేదు. అందుకనే దాదాపు 24 గంటలు వీళ్ళు ఎక్కడా మాట్లాడలేదు. ఆ తర్వాత మెల్లిగా తేరుకుని జగన్ కు వ్యతిరేకంగా కథనాలు, ఇంటర్వ్యూలు వండి వార్చటం మొదలుపెట్టారు. గడిచిన వారంరోజులుగా జగన్ కు వ్యతిరేకంగా ఎవరెవరితోను ప్రత్యేకంగా మాట్లాడుతూ ఇంటర్వ్యూలు అచ్చేస్తున్నారంటనే వీళ్ళెంతగా షాక్ తిన్నారో అయ్యారో తెలిసిపోతోంది. జగన్ వ్యతిరేక కథనాలు, ఇంటర్వ్యూలను ఎల్లోమీడియా ఎంతగా ప్రచురిస్తోందో ఇదే స్ధాయిలో జగన్ కు మద్దతుగా మరికొందరు జస్టిస్ లు, న్యాయనిపుణులు మాట్లాడుతున్నారు. దాంతో ఎల్లోమీడియా మరింతగా మండిపోతోంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే న్యాయమూర్తులపై జగన్ ఫిర్యాదు చేయటమే తప్పన్నట్లుగా ఎల్లోమీడియా వండి వారుస్తున్న కథనాలంతా తప్పని ఎప్పుడో తేలిపోయింది. ఎందుకంటే 1961లో కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ తో పాటు కొందరు జడ్జీలపై అప్పటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి లాల్ల బహద్దూర్ శాస్త్రికి ఫిర్యాదు చేసిన విషయం బయటపడింది. దాంతో ప్రభుత్వ రహస్యాలు బయటపెడతారా అనే పలికిమాలిన విషయాలపై ఎల్లోమీడియా రాద్దాంతం చేస్తోంది. ఎల్లోమీడియాలో అసహనం ఎందుకు పెరిగిపోతోందంటే జగన్ కు వ్యతిరేకంగా తాము రాస్తున్న కథనాలు, ఇంటర్వ్యూల్లో పసలేదని తేలిపోవటంతోనే.
ఇదే విషయమై ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ కు జగన్ లేఖ రాయటంలో తప్పేమీ లేదన్నారు. బాబ్డేకి చేసిన ఫిర్యాదును మీడియాకు రిలీజ్ చేయటం కూడా తప్పు కాదన్నారు. తాను రోజుకి 10 ఇంగ్లీషు డైలీలు చదువుతానని వాటిల్లో ఎక్కడా జగన్ కు వ్యతిరేకంగా న్యాయనిపుణులు మాట్లాడటం లేదన్నారు. జగన్ రాసిన లేఖకు మద్దతుగా న్యాయనిపుణులు మాట్లాడుతున్న విషయాన్ని ప్రొఫెసర్ గుర్తుచేశారు. పైగా ప్రశ్నించటానికి జడ్జీలేమన్నా అతీతులా అన్నట్లుగా ప్రొఫెసర్ అనుమానం వ్యక్తం చేశారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ లో ఏసీబీ విచారణపై హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వటమే తప్పన్నారు. దీని వల్లే రాష్ట్రలో ఏదో జరుగుతోందన్న అనుమానం దేశమంతా వ్యాపించిందన్నారు.
ఇన్ సైడర్ ట్రేడింగ్ విచారణలో సుప్రింకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ కూతుర్లున్నారనే ఆరోపణలు రాగానే హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఎలా ఇస్తుందనే చర్చ దేశంలో పెరిగిపోయిందని అభిప్రాయపడ్డారు. ఏ కేసు విషయంలో అయినా మీడియా తన పద్దతిలో తాను రిపోర్టు చేస్తుందన్నారు. కానీ మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలిపాటి శ్రీనివాస్ విషయంలో మాత్రం ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను ప్రచురించకూడదని, మాట్లాడకూడదని హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వటంలో ఆంతర్యం ఏమిటని ప్రొఫెసర్ సూటిగా ప్రశ్నించారు. ఇక్కడే జగన్ చేసిన ఫిర్యాదుకు మద్దతు పెరుగుతోందన్నారు.