హెరాల్డ్డ్ ఎడిటోరియల్ : న్యాయవ్యవస్ధ మీద జగన్ ఫిర్యాదుకు కారణం ఇదేనా ?
మరి న్యాయవ్యవస్ధ మీద ఫిర్యాదులు చేయాలనేంత డేరింగ్ స్టెప్ ఎందుకు తీసుకున్నాడు ? అదికూడా ఎవరో అనామకులు మీద కాదు ఫిర్యాదు చేసింది. ప్రస్తుత సుప్రింకోర్టు జస్టిస్, తొందరలోనే చీఫ్ జస్టిస్ అవుతారని అనుకుంటున్న ఎన్వీ రమణ మీద. రమణతో పాటు హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి+మరో ఆరుగుగు జడ్జీల మీద ఫిర్యాదులు చేయటమంటే మామూలు విషయం కాదు. చంద్రబాబు, దమ్మాలపాటి మీద చేసేవి రాజకీయ విమర్శలే అనుకున్నా న్యాయవ్యవస్ధలోని ప్రముఖుల మీద నోటికొచ్చినట్లు ఆరోపణలు చేస్తే కుదరదు. అందుకనే పక్కాడా, ఆధారాలతో సహా జగన్ ఆరోపణలు చేశాడు. వాళ్ళందరిపైన అసలు ఆరోపణలు చేయాల్సిన అవసరం జగన్ కు ఏమొచ్చింది అన్నదే అసలైన ప్రశ్న.
ముందే ఎల్లోమీడియా బురద చల్లుతున్న ప్రకారం తనపైన విచారణ జరుగుతున్న కేసుల నుండి తప్పించుకోవటానికైతే మాత్రం కాదు. ఇక్కడ గమించాల్సిన విషయం ఏమిటంటే జగన్ పై నమోదైన కేసులు సంవత్సరాల తరబడి కోర్టుల్లో విచారణలు జరుగుతున్నా ఇంతవరకు ఒక్క కేసు కూడా ఫైనల్ కాలేదు. పైగా జగన్ కేసుల్లో ఇరుక్కున్న ఐఏఎస్ అధికారుల్లో చాలామందిపైన నమోదైన కేసుల్లో ఆధారాలు లేవని కోర్టు కొట్టేసింది. ఇదే సమయంలో వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలను విచారించిన కోర్టులు వాళ్ళపైన కూడా సరైన ఆధారాలు లేవని నిర్ధారించింది. ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్ పై సీబీఐ పెట్టిన క్విడ్ ప్రోకో కేసును కోర్టు కొట్టేసింది. ఇలాంటి కేసుల్లోనే మరికొందరిపైన కేసులను ఎత్తేసింది. విచారణ జరిపినంతలో క్విడ్ ప్రో కో జరిగినట్లు సీబీఐ సాక్ష్యాలను చూపలేకపోయిందని కోర్టు గతంలోనే అభిప్రాయపడింది.
జగన్ మీదున్న కేసుల్లో ఇటు ఐఏఎస్ అధికారులపైనా సాక్ష్యాలు లేవని, ఇటు పారిశ్రిమకవేత్తలు, వ్యాపారవేత్తలు క్విడ్ ప్రో కో కు పాల్పడినట్లు సాక్ష్యాలు లేవని కోర్టు అభిప్రాయపడితే ఇక జగన్ అవినీతికి పాల్పడిందెక్కడ ? పైగా కేసులు నమోదు చేసేనాటికి జగన్ కు ప్రభుత్వంలో ఎటువంటి హోదా కూడా లేదు. అంటే ప్రభుత్వాన్ని జగన్ ప్రభావితం చేశాడనేందుకు కూడా ఆధారాలు లేనట్లే. కాబట్టి తనపై ఉన్న కేసులన్నీ అక్రమంగా రాజకీయ దురుద్దేశ్యాలతో పెట్టినవే అన్న జగన్ వాదన మెల్లిగా అయినా నిరూపణవుతుందేమో. కాబట్టి ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణ వల్ల తనకు ఎటువంటి ఇబ్బంది ఉండదని జగన్ కు బాగా తెలుసు. కాకపోతే ఏదో రూపంలో తనపై నమోదైన కేసులను తిరిగతోడి మళ్ళీ ఏదో విధంగా బెయిల్ రద్దు చేసి ఇబ్బందులు పెడతారని జగన్ అనుమానిస్తున్నట్లు ఉంది. ఆ అవకాశం ప్రత్యర్ధులకు ఇవ్వకూడదనే తానే ముందుగా చొరవ తీసుకుని ప్రత్యర్ధులకు మద్దతుగా నిలబడుతున్న వాళ్ళపై ఫిర్యాదులు చేశాడు.