
బాబోరి అస్త్రసన్యాసం... 24 గంటల్లో సీన్ రివర్స్...!
రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఇప్పుడు ఆత్మరక్షణలో పడిపోయింది. అరెస్టు అవుతున్న నాయకులు ఒకవైపు.. రేపో.. మాపో అరెస్టవడం ఖాయమని అంటున్న నాయకులు మరో వైపు .. పార్టీ అధినేత చంద్రబాబుకు కరోనాను మించిన కలవరం ఏర్పడింది. ఈ పరిణామాల మధ్యలోనే మంగళ వారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గతానికి భిన్నంగా రెండు రోజులే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో జగన్ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం బడ్జెట్ను ప్రవేశ పెట్టడం సహా కీలకమైన ఆర్థిక బిల్లులను ప్రవేశ పెట్టి ఆమోదింపజేసుకోవడం. ఈ విషయంలో సీఎం జగన్ పక్కా క్లారిటీగా ఉన్నారు.
అయితే, ఇదే సమయంలో నిన్నటి వరకు టీడీపీ జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్థావించాలని భావించింది. అంతేకా దు, ఏడాది కాలంలో జగన్ పథకాలపై నా విమర్శలు గుప్పించాలని ముందుగానే ప్లాన్ చేసుకుంది. వీటికి తోడు.. కోర్టుల్లో జగన్ ప్రభుత్వానికి ఎదురవుతున్న వ్యతిరేకతను కూడా ప్రస్థావించాలని భావించారు. కానీ.. ఇప్పుడు అనూహ్యంగా కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే పరిస్థితి మారిపోయింది. కీలకమైన టీడీపీ నేతలు అరెస్టయ్యారు. దీంతో టీడీపీలోనే ఒక అనూహ్యమైన వాతావరణం ఏర్పడింది. ఇ ప్పుడు పార్టీని, నేతలను కాపాడుకోవాల్సిన అత్యవసరమైన పరిస్థితి చంద్రబాబుకు ఏర్పడింది.
ఈ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా.. మొత్తంగా పార్టీకే తీరని నష్టం ఏర్పడడం ఖాయం. కాబట్టి.. ఆయా విష యాలను అసెంబ్లీలో లేవనెత్తి తీవ్రస్థాయిలో విరుచుకుపడితే.. చంద్రబాబు ప్రయోజనం ఉంటుందా ? అంటే.,. ఉంటుంది. ప్రభుత్వం కూడా ఇదే కోరుకుంటుంది. ఎందుకంటే.. చంద్రబాబు హయాంలో జరిగిన తప్పులను ఏకిపారేయాలని జగన్ సర్కారు ఎదురు చూస్తోంది. సో.. చంద్రబాబు కనుక ఆచి తూచి వ్యవహరించకపోతే.. గత పాలన విషయంలో అసెంబ్లీ సాక్షిగా ఎదురుదాడిలో చిక్కుకుపోవడం ఖాయమని ముందే అంచనాలు ఉన్నాయి. అయితే చంద్రబాబు అసలు అసెంబ్లీ సమావేశాల తొలి రోజునే పూర్తిగా నిరసనల పేరుతో చేతులు ఎత్తేసి అస్త్రసన్యాసం చేసేశారు.