జస్టిస్ రమణ బావోద్వేగం

Vennelakanti Sreedhar
జస్టిస్ రమణ  బావోద్వేగం
కాలం ఒదిగింది. ఇది  ఎన్నటికీ నిజమే. కాలమేప్పుడూ తనలో తాను ఒదిగే ఉంటుంది.  అంతేకాదు మనుషులు కూడా కాలంతో  బాటే ఒదుగుతారు. ఒదిగి ఉండే వాళ్లు ఎదుగుతారు. నోరి దత్తాత్రేయుడు.. వైద్యరంగం పై అవగాహన  ఉన్న వారికి పరిచయం అవసరం లేని పేరు. ప్రముఖ వైద్యుడు. ఎంతో మంది దేేశ విదేశీ నేతలకు శస్త్ర చికిత్సలు విజయవంతంగా  నిర్వహించిన డాక్టర్. అంతకు మించి పేదోళ్లకు వైద్యనారాయణుడు. ఆయన చేయి పట్టుకు చూస్తే చాలు రోగం నయమవుతుందని, ఆయన హస్తవాసి అటువంటిదని  భారత మాజీ ప్రధాన మంత్రి వాజ్ పేయి ఒక సందర్భంలో తెలిపారు. ఆయన  తాను జీవితంలో చేసిన పరిక్షలు, ఎదుర్కోన్న పరీక్షలను అక్షర బద్దం చేశారు. ఒదగిన కాలం పేరుతో దానిని ప్రపంచానికి అందించారు. ఈ పుస్తకావిష్కరణ కు హైదరాబ్ లోని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వేదికగా నిలిచింది.  ఆంధ్ర ప్రదేశ్ ఉప సభాపతిగా సేవలందించిన మండలి బుద్ధ ప్రసాద్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రమణాచారి, రచయితలు జొన్నవిత్తుల,  ఓలేటి పార్వతీశం తదితరులు ప్రసంగించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి  వర్చవల్ లో  ప్రసంగించారు.  ఎందరో తమ  స్వీయ చరిత్రలు రాస్తున్నారని , వాటన్నింటిలోని సరుకు అంతంత మాత్రంగా నే ఉంటోందని జస్టిస్ రమణ పేర్కోన్నారు.  నోరి దత్తాత్రేయుడు రచించిన ఒదిగిన కాలం స్వియ చరిత్రలా కాకుండా ఎన్నో విషయాలను  నేటి తరానికి అందిస్తుందని తెలిపారు. ముఖ్యంగా భారత దేశంలో ని మూలాలు, గ్రామీణ జీవనం,  చదువు నేర్చుకునేందుకు  నాటి తరం పడిన కష్టాలు అన్నీంటినీ అక్షర బద్దం చేశారని రమణ చెప్పారు. ఈ పుస్తకాన్ని చదువుతుంటే తనకు కళ్లు చెమర్చాయని జస్టిస్ రమణ తన ప్రసంగంలో భావోద్వేగానికి లోనయ్యారు. 'నోరి దత్తాత్రేయుడు బాల్యం ఎదురైన ఇబ్బందులకు వివరించారు తన పై వచ్చిన ఫిర్యాదులను, వాటి పై  సుధీర్ఘకాలం సాగిన విచారణలు,  ఫలితంగా ఆయన పడిన మానసిక క్షోభను కూడా వివరించారు. ఇవన్నీ చదువుతున్నప్పుడు ఎంతటి వారికైనా నీలాపనిందలు తప్పవేమో అనిపించింది. నేనూ కూడా జీవన నా ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. శ్రీరాముడుకి కూడా నిందలు తప్పలేదు'  అని జస్టిస్ రమణ తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: