ఇంటర్ అర్హతతో సాఫ్ట్వేర్ జాబ్ పొందండి ఇలా!

Purushottham Vinay
ఇక ప్రస్తుతం మార్కెట్లో మొత్తం సాఫ్ట్ వేర్ హవానే ఎక్కువగా కొనసాగుతోంది. మిగిలిన రంగాలతో పోల్చితే ఈ రంగంలోనే ఎక్కువగా జీతం విషయంలో గ్రోత్ అనేది ఉంటుంది.అందుకే ఇక బీటెక్ పూర్తి చేసిన చాలామంది విద్యార్థులు కూడా ఈ రంగం వైపు మొగ్గు చూపుతున్నారు.ఇక దీనిలో భాగంగానే క్యాంపస్ లోనే చాలామంది కొలువులు అనేవి సంపాదిస్తుంటే.. మరికొంత మంది మాత్రం కమ్యూనికేషన్ స్కిల్స్ లేక ఉద్యోగం అనేది పొందలేకపోతున్నారు.ఇక అటువంటి వారు హైదరాబాద్ ఇంకా బెంగళూరు వంటి నగరాల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలే లక్ష్యంగా సాప్ట్ వేర్ కొలువుకు సంబంధించిన కోర్సులను కూడా ఎక్కువగా నేర్చుకుంటున్నారు. వీటికి కూడా ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ డిగ్రీలు అనేవి పూర్తి చేసుండాలి.కేవలం వీరికి మాత్రమే సాప్ట్ వేర్ కొలువులు వస్తాయనే ధోరణి ఉండేది.. కానీ హెచ్ సీఎల్ టెక్నాలజీస్ మాత్రం ఇంటర్ పూర్తిచేస్తే చాలు ఐటీ ఉద్యోగ అవకాశం ఉంటుందని కూడా చెబుతోంది.ఇక హెచ్ సీఎల్ టెక్ బీ ప్రోగ్రామ్ ద్వారా.. ఎంట్రీ లెవల్ ఐటీ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్య శిక్షణను కూడా అందిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల అయింది. దీనికి సంబంధించి అర్హతలు, ఎంపికలు, ఫీజులు, శిక్షణ ఇంకా కెరీర్ స్కిల్స్ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం..ఇక దీనిలో ఎంపిక కావాలంటే అభ్యర్థుల అర్హత ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. అది కూడా 2021 ఇంకా 2022లో ఉత్తీర్ణులై ఉండాలి. ఇక 60 శాతం మార్కులతో మ్యాథమేటిక్స్ లేదా బిజినెస్ మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్ట్ ఉండాలి. 


వీటికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హెచ్సీఎల్ కెరీర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది నిర్వహిస్తుంది. ఇంకా దీనిలో ప్రతిభ కనబరిచిన వారికి ఇంటర్వ్యూలో కొన్ని ప్రమాణాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత 12 నెలల కాలానికి శిక్షణ ఉంటుది.ఇంకా దీనికి ఫీజు రూ. 2లక్షలు. కుటుంబ వార్షిక ఆదాయం వచ్చేసి రూ.2లక్షల కంటే తక్కువ ఉన్నవారికి బ్యాంక్ నుంచి లోన్ సౌకర్యం కల్పించనున్నారు. అలాగే ట్రైనింగ్ లో నిర్వహించే పరీక్షలో 90 శాతం అంతకన్నా కూడా ఎక్కువ స్కోర్ చేసిన వారికి ప్రోగ్రామ్ ఫీజులో 100 శాతం రాయితీ కల్పించనున్నారు.ఇంకా 85 నుంచి 90 శాతం మధ్య ఉంటే.. 50 శాతం రాయితీ అనేది ఇస్తారు. ట్రైనింగ్ కనుక విజయవంతంగా పూర్తిచేసుకున్న వారిని హెచ్ సీఎల్ టెక్నాలజీలో పూర్తికాల ఉద్యోగులుగా వారు నియమించుకుంటారు. ఎంపికైన అభ్యర్థులను లక్నో, నోయిడా, మధురై, చెన్నై, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు ఇంకా నాగపూర్లోని కేంద్రాల్లో శిక్షణ అందిస్తారు. ఇక టెక్ బీ ప్రోగ్రామ్ లో భాగంగా ఇంషిప్ చేసేటప్పుడు అభ్యర్థికి నెలకు మొత్తం రూ.10 వేలచొప్పున స్టయిపెండ్ చెల్లిస్తారు. ఇంకా అలాగే పూర్తిస్థాయి ఉద్యోగిగా ఎంపికైతే.. ప్రారంభ వార్షిక వేతనం వచ్చేసి రూ.1.70 లక్షల నుంచి రూ.2.20లక్షల వరకు ఉంటుంది.ఇక https://www.hcltechbee.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి..https://www.hcltechbee.com/about-us/#check-before లింక్ పై క్లిక్ చేసి మీరు దరఖాస్తు చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

HCL

సంబంధిత వార్తలు: