ఆన్లైన్లో రూ. లక్ష ఫోన్ ఆర్డర్ పెట్టాడు.. కానీ తీసుకోవడానికి డబ్బుల్లేక ఏం చేశాడంటే?
ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఏకంగా ఒక యువకుడు లక్ష రూపాయల విలువ చేసే సెల్ఫోన్ ను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాడు. కానీ దగ్గర డబ్బులు లేకపోవడంతో ఏకంగా అత్యంత కిరాతకానికి పాల్పడ్డాడు. డెలివరీ చేసేందుకు వచ్చిన బాయ్ ను చంపేశాడు. లక్నోలో హిమాన్షు కనోజియా అనే వ్యక్తి ఆన్లైన్ లో మొబైల్ ఫోన్ ఆర్డర్ పెట్టాడు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ను ఎంచుకున్నాడు.
దీంతో డెలివరీ బాయ్ భరత్ సాహూ (30) మొబైల్ డెలివరీ చేసేందుకు ఇంటికి చేరుకోగా.. అతను సహచరులతో కలిసి డెలివరీ బాయ్ ను గొంతు నూరుమి హత్య చేశాడు. మొబైల్ తో అదృశ్యమయ్యాడు. ఇక్కడ డెలివరీ బాయ్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతని వెతకడం ప్రారంభించారు. వారం రోజుల వెతికిన ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఇక విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు హంతకులను పట్టుకున్నారు. అయితే హిమాన్షు కనోజియా అనే వ్యక్తి ఒకే నెంబర్ నుంచి రెండు ఫోన్లు ఆర్డర్ చేశాడు. వాటి విలువ సుమారు లక్ష వరకు ఉంటుందట. ఇక ఆ మొబైల్స్ ని డెలివరీ చేసేందుకు చిన్ హాట్ లోనే దేవా రోడ్ లో హిమాన్షు ఇంటికి భరత్ చేరుకున్నాడు. ఈ క్రమంలోనే హిమాన్షు మరికొంతమంది స్నేహితులను పిలిచి భరత్ గొంతు నులిమి హత్య చేసి మొబైల్ ఫోన్ డబ్బు దోచుకుని అక్కడి నుంచి పరారయ్యాడు అంటూ విచారణలో పోలీసులు నిజాలను రాబట్టారు.