ప్రాణం తీసిన ఇడ్లీ.. ఇంతకీ ఏం జరిగిందంటే?
ఇక ఇలాంటి తరహా ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూ ఎంతోమందిలో భయాందోళనలు పెంచేస్తూ ఉన్నాయి అనడంలో సందేహం లేదు దీంతో ప్రతి ఒక్కరు ఎప్పుడూ ఎలా ప్రాణం పోతుందో కూడా తెలియక.. భయంతోనే జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నారు. అయితే ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన గురించి తెలిస్తే.. మాత్రం ఇలా కూడా ప్రాణాలు పోతాయా అనే భావన ప్రతి ఒక్కరికి కలుగుతుంది. సాధారణంగా ఎంతో మంది రోజు ఉదయం టిఫిన్ లో ఇడ్లీ తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇడ్లీ నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.
అందుకే ఇడ్లీ తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఇలా నోట్లో వేసుకోగానే వెన్నపూసలా కరిగిపోయే ఇడ్లీ కూడా ప్రాణాలు తీస్తుంది అంటే నమ్ముతారా.. కానీ నమ్మాల్సిందే.. ఎందుకంటే ఇక్కడ అలాంటి ఘటన జరిగింది. కేరళ లోని పాలక్కాడ్ జిల్లాలో ఒక వ్యక్తి ఇడ్లీ తింటూ చనిపోయాడు. ఓనం పండుగ సందర్భంగా అక్కడ పలు రకాల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే 49 ఏళ్ల సురేష్ అనే వ్యక్తి ఇడ్లీలు తినే పోటీలో పాల్గొన్నారు. ఒకేసారి మూడు ఇడ్లీలు తినేందుకు ప్రయత్నించగా.. గొంతులో ఇరుక్కున్నాయి. దీంతో ఊపిరాడక ఒక్క సరిగా కుప్పకూలిపోయాడు. అయితే నిర్వాహకులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.