దారుణం : చనుబాలు ఇస్తూనే.. పసికందును చంపేసింది?

praveen
సాదరణం గా మనిషి జీవితం లో ఎన్నో రకాల బంధాలు ఉంటాయి. కానీ అన్ని బంధాలలోకెల్లా గొప్పది కేవలం పేగు బంధం మాత్రమే అని అంటూ ఉంటారు. ఎందుకంటే తల్లి తన పిల్లలను నవమాసాలు బరువు అనుకోకుండా మోస్తుంది. అంతేకాదు కలలో కూడా ఊహించనంత నొప్పిని భరించి ఏకంగా పిల్లలకు జన్మనిస్తుంది. ఒక రకంగా ఇలా పిల్లల పుట్టిన సమయం లో తల్లి పునర్జన్మను పొందుతుంది అని చెప్పాలి. ఇలా పిల్లలను కనడంతోనే తన పని అయిపోయింది అనుకోకుండా ఆ పిల్లలను కంటికి రెప్పలా కాచుకుంటుంది.

 ఎప్పుడూ పిల్లలతో సున్నితం గా ఉండే తల్లి.. అదే పిల్లలకు ఏదైనా కష్టం వస్తే అపరకాలిలా మారి పోయి ఆ సమస్యను తరిమి కొడుతుంది. ఇక పిల్లలకు ఏ కష్టం రాకుండా ప్రతిక్షణం కాచుకుంటూ ఉంటుంది. అందుకే ఇక ఈ లోకం లో తల్లి ప్రేమను మించింది మరొకటి లేదు అని చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక తల్లి మాత్రం కడుపున కూతురు విషయంలో కాస్తయినా జాలి చూపించలేకపోయింది. ముక్కుపచ్చలారని చిన్నారిని ఏకంగా లోకాన్ని చూడకముందే దారుణంగా చంపేసింది. చనుబాలు ఇస్తూనే చివరికి చిన్నారి గొంతును హత్య చేసింది. ఈ అమానవీయ ఘటన ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది.

 ఆరు రోజుల బిడ్డకు చనుబాలు ఇస్తూ తల్లి శివాని పసికందు గొంతు నిలిమి చంపేసింది. అంతేకాదు ఇంటి పైనుంచి విసిరేసింది. వరుసగా నాలుగోసారి ఆడపిల్ల పుట్టడంతో ఈ దురాగతానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. చంపేసిన తర్వాత బిడ్డ కనిపించట్లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది సదురు మహిళ. అయితే పోలీసులు విచారణ చేస్తున్న సమయంలో సదరు మహిళ ప్రవర్తన తీరుతో అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించడంతో ఇక నేరాన్ని అంగీకరించింది. ఈ ఘటనతో స్థానికులందరూ ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: