పట్టపగలే.. నడిరోడ్డుపై.. ఎలా చోరీ చేశారో చూడండి?

praveen
ఈ మధ్యకాలంలో దొంగల బెడద ఎక్కడ చూసినా కూడా ఎక్కువ అయిపోయింది. మొన్నటి వరకు కేవలం తాళం వేసి ఉన్న ఇళ్లకు మాత్రమే చోరీకి పాల్పడేవారు దొంగలు. కానీ ఇప్పుడు ఏకంగా పట్టపగలే దొంగతనాలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న ఏకంగా నిలువు దోపిడీ చేసేస్తూ ఉన్నారు. అందిన కాడికి దోచుకుపోతూ.. ఎంతో మందికి షాక్ ఇస్తున్నారు. ఇటీవల పూణేలో కూడా ఇలాంటి ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

 వడపావ్ తినేందుకు ఆగిన వృద్ధ దంపతుల నుంచి ఏకంగా ఐదు లక్షల రూపాయల విలువైన నగలను దొంగ ఎత్తుకెళ్లాడు. చూస్తూ చూస్తుండగానే పట్టపగలే ఈ దొంగతనం చేశాడు. అయితే మహిళా దొంగను వెంబడించిన ఉపయోగం లేకుండా పోయింది. పట్టపగలే రద్దీగా ఉన్న రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. నగరానికి చెందిన వృద్ధ దంపతులు మధ్యాహ్న సమయంలో బ్యాంకుకు వెళ్లి అక్కడ 5 లక్షల రూపాయల విలువైన నగలు తీసుకొని స్కూటీపై బయలుదేరారు.

 మార్గమధ్యమంలో ఒకచోట ఏకంగా వడపావు తినేందుకు ఆగారు. అయితే నగల సంచిని స్కూటర్ ముందు భాగంలో తగిలించారు. వడపావు తినేందుకు బండిని రోడ్డు పక్కన ఆపారు ఆ వృద్ధ దంపతులు. భర్త వడపవ్ తెచ్చేందుకు దుకాణం వద్దకు వెళ్ళగా.. ఇక అతని భార్య అక్కడే స్కూటీ పక్కన ఉంది. అంతలో మొహానికి మాస్క్ కట్టుకొని అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి అటు ఇటు చూసి స్కూటర్ ముందు భాగంలో పెట్టిన నగల సంచిని దొంగలించి పరారయ్యాడు. దీనిని గమనించిన మహిళ గట్టిగా కేకలు వేసింది. ఆ తర్వాత అతని వెంబడించిన ఉపయోగం లేకుండా పోయింది. దీంతో లబోదిబోమంటూ ఆ వృద్ధ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిసిటీవీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దుండగులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: