గుడివాడ : గర్ల్స్ కాలేజీ బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు..300 న్యూడ్ వీడియోలు తీసి ?
సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేస్తూ వుయ్ వాంట్ జస్టిస్ అంటూ విద్యార్థినిలు నినాదాలు చేశారు. కెమెరాల ద్వారా వచ్చిన వీడియోలను అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నించారు. ఈ విషయం తెలుసుకొని కాలేజీ హాస్టల్ కు చేరుకున్న పోలీసులు....ఆరోపణలు వచ్చిన ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ ను ప్రశ్నిస్తున్నారు. విద్యార్థి ల్యాప్ ట్యాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు...300 వీడియోలు గుర్తించినట్లు సమాచారం.
ఇక తెల్లవారుజామున 3.30 గంటల వరకు కృష్ణా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హైడ్రామా కొనసాగింది. ఫైనల్ ఇయర్ విద్యార్థికి..... మరో గర్ల్స్ హాస్టల్ విద్యార్థిని సహకరిస్తూ కెమెరాలు ఏర్పాటు చేసిందంటూ ఆరోపణలు వస్తున్నాయి. బాలికల హాస్టల్ ల్లో హిడెన్ కెమెరా గుర్తించారంటూ ' ఎక్స్ ' వేదికగా పోస్ట్ లు పెట్టారు విద్యార్థులు.