షాకింగ్: బాలుడి మర్మాంగం కోసేసి ప్రాస్టిట్యూషన్‌లోకి దించిన హిజ్రాలు..?

praveen
బెంగళూరు నగరంలో దేశ ఉలిక్కిపడే ఒక శాతం సంఘటన చోటుచేసుకుంది. ఐదుగురు హిజ్రాలు కలిసి ఒక బాలుడిని దారుణంగా కొట్టారు. అంతేకాదు అతడి మర్మాంగాన్ని కోసేసి వ్యభిచారం చేయాలని చిత్రహింసలు పెట్టారు. పూలకేశి నగర్ పోలీసులు ఐదుగురు ఈ ట్రాన్స్‌జెండర్లపై కేసు నమోదు చేశారు. వీరు ఒక యువకుడిని బలవంతంగా వ్యభిచారం చేయవలసిందిగా బెదిరించి, అతనిపై దారుణంగా దాడి చేశారని పోలీసులు చెబుతున్నారు.
పోలీసుల కంప్లైంట్ ప్రకారం, బాధితుడిని వ్యభిచార వృత్తిలోకి నెట్టడానికి నిందితులు చిత్ర, అశ్విని, కాజల్, ప్రీతి, ముగిలలు అతనిపై చాలా దారుణంగా ప్రవర్తించారు. బాధితుడు ఒక టీ కొట్టులో వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. ఈ యువకుడిని ఐదుగురు హిజ్రాలు చాలా దారుణంగా హింసించారు. ఆ యువకుడిని వదిలిపెట్టమని ఎంత బతిలాడినా వదిలిపెట్టలేదు. అంతేకాకుండా, ఆ యువకుడిని భయపెట్టి వ్యభిచారం చేయాలని బలవంతం చేయడానికి అతని శరీరంలోని ప్రైవేట్ పార్ట్‌ను భాగాన్ని కత్తితో కోసివేశారు. ఈ దారుణమైన చర్యను "బొబ్బిటైజింగ్" అని అంటారు.
1993లో లొరేనా బొబ్బిట్ అనే మహిళ తన భర్త జాన్ బొబ్బిట్ ప్రైవేట్ పార్ట్‌ను కత్తితో కోసివేసింది. ఆ తర్వాత ఈ రకమైన దారుణమైన చర్యను "బొబ్బిటైజింగ్" అని పిలుస్తారు. ప్రతీకారం తీర్చుకోవడానికి లేదా హింసించడానికి వారి శరీరంలోని ఆ భాగాన్ని కోసి వేయడం ఇటీవల కాలంలో కామన్ అయిపోయింది.
అయితే, ఈ ఘటనలో బాధితుడు అదృష్టవశాత్తు ఆ ప్రదేశం నుంచి తప్పించుకోగలిగాడు. తర్వాత వెంటనే పూలకేశి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతను తనపై జరిగిన దాడి గురించి వివరంగా చెప్పి, తనను హింసించిన వారి పేర్లు కూడా చెప్పాడు. పోలీసులు ఇప్పుడు ఆ ఐదుగురిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ వ్యక్తులు పోలీసులనుంచి తప్పించుకుంటూ తిరుగుతున్నారు. ఈ ఘటన స్థానికంగా పెద్ద కలకలం సృష్టించింది ఇలాంటి హిజ్రాలు ఇంకా ఎంతమంది చిన్న పిల్లల జీవితాలను నాశనం చేస్తారేమో ఏమో అని అందరూ భయపడుతున్నారు. భారతీయ న్యాయ సంహిత కింద ఈ హిజ్రాలపై కేసు నమోదు చేశారు. గాయపరిచినందుకు, కిడ్నాప్ చేసి వ్యభిచారంలో దింపేందుకు ప్రయత్నించినందుకు, భయపెట్టినందుకు, డెడ్లీ ఇంజురీస్ కలిగించినందుకు వీరిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: