అమ్మ కావాలనుకుంది.. కానీ విధి మరొకటి తలచింది.. చివరికి?
ఇలా గర్భం దాల్చి తమ ప్రతిరూపాన్ని ఇక ఈ లోకంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి మహిళ కూడా ఎంతగానో ఇష్టపడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ కొంతమంది విషయంలో మాత్రం ఆ దేవుడు ఎందుకో కక్ష కట్టినట్లుగానే వ్యవహరిస్తూ ఉంటాడు. విధియాడిన వింత నాటకంలో కొంతమంది మహిళలు అమ్మ అని పిలిపించుకోకుండానే కానరాని లోకాలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఒక మహిళకు ఇలాంటి పరిస్థితి ఎదురయింది. ఆమెకు పెళ్లయిన తర్వాత అమ్మతనాన్ని ఆస్వాదించాలని ఎంతగానో ఆశపడింది. గర్భం దాల్చింది. నెలలు కూడా నిండాయి. మరికొన్ని రోజుల్లో ప్రసవం కావాల్సి ఉంది. దీంతో తన పిల్లలతో అమ్మ అని పిలిపించుకోబోతున్నాను అంటూ ఆమె ఎంతగానో సంతోష పడిపోయింది.
కానీ ఆమె ఒకటి తలిస్తే విధి మరొకటి తరిచింది. నెల నుండిన ఆ గర్భిణీ మరి కొద్ది రోజుల్లో తనలోని ప్రాణాన్ని బయట ప్రపంచంలోకి తీసుకువస్తానని ఆనందపడుతుండగా.. చివరికి ఆమెను కానరాని లోకాలకు పంపించేసింది విధి. అమ్మనయే మధురానుభూతి పొందేందుకు ఆరటపడిన ఆమెను అంతలోనే కబలించింది మృత్యువు. ఈ విషాదకర ఘటన హనుమకొండ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. గుట్ల కానిపల్లికి చెందిన శిరీష నిండు గర్భిణి. అయితే ఇటీవల డెంగ్యూ బారిన పడటంతో ఆసుపత్రిలో చేరింది. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ ఇటీవల పరిస్థితి విషమించి ప్రాణాలు విడిచింది. అయితే కడుపులో ఉన్న కవలలను కాపాడేందుకు డాక్టర్లు ప్రయత్నించిన ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ఘటనతో ఒక కుటుంబం మొత్తం కన్నీరు మున్నీరుగా విలపించింది.