డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన యువకుడు.. పోలీసులు ఎలా కొట్టారో చూడండి?

praveen
సాధారణంగా వాహనదారులందరూ కూడా తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ప్రమాదాలను నివారించాలి అంటూ పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే  అయితే ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వాహనదారుల పట్ల ఈ మధ్యకాలంలో పోలీసులు కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నారు. ఇలా రూల్స్ అతిక్రమిస్తూ పట్టుబడితే చాలు ఇక భారీగా జరిమానాలు విధిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఇలాంటివి చేయడం ద్వారా అయినా ప్రమాదాలను నివారించవచ్చు అని పోలీసులు భావిస్తున్నారు.

 అయినప్పటికీ అటు వాహనదారుల తీరిలో మాత్రం అసలు మార్పు రావడం లేదు. ఏకంగా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించడం కాదు.. మొబైల్ మాట్లాడుతూ వాహనం నడపడం చేస్తున్నారు. ఇంకొంతమంది ఏకంగా తాగి బండి నడుపుతూ ఎన్నో ప్రమాదాలకు కారణమవుతున్నారు అని చెప్పాలి. అయితే ఇలాంటి ప్రమాదాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ మధ్యకాలంలో ఇక పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేయడం మొదలుపెట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వారికి కఠిన శిక్షలు విధిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ పోలీసులు ఇలాగే తనిఖీలు నిర్వహించగా.. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ కొంత మంది వ్యక్తులు పట్టుపడ్డారు.

 ఈ క్రమంలోనే పోలీసులకు ఇలా తాగి బండి నడుపుతున్న వాహనదారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది అని చెప్పాలి. ఇక హైదరాబాద్ నగరంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం తాగి వాహనం నడిపిన యువకులను పోలీసులు కొట్టారు. శంకర్పల్లి రోడ్డు లోని గవర్నమెంట్ కాలేజ్ వద్ద చేవెళ్ల పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. పోలీసులకు పట్టుబడిన మహేష్ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు పట్టుకొని అతనితో రోడ్డు మీదకు తీసుకువచ్చారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి. అయితే తమ విధులకు ఆటంకం కలిగించడంతోనే ఇలా చేయాల్సి వచ్చిందని పోలీసులు వివరణ ఇస్తూ ఉండడం గమనార్హం.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: