పసిపాపకు సిగరెట్, మద్యం తాగించిన తల్లీ.. చివరికి?
ఏకంగా పిల్లలతో ఒకే గదిలో ఉన్నప్పుడు పొగ తాగకూడదు మద్యం సేవించరాదు అని సూచిస్తూ ఉంటారు నిపుణులు. కానీ ఇక్కడ మాత్రం ఓ తల్లి ఏకంగా అభం శుభం తెలియని చిన్నారి విషయంలో కర్కషంగా ప్రవర్తించింది. ఏ కష్టం రాకుండా కంటికి రెప్పలా బిడ్డను చూసుకోవాల్సిన తల్లి.. చివరికి కర్కశంగా ప్రవర్తించింది. ఏకంగా 20 నెలల పసికందుకు బలవంతంగా సిగరెట్ మద్యం తాగించింది. ఈ అమానవీయ ఘటన అస్సాంలో వెలుగు చూసింది. శించార్ కు చెందిన ఒక మహిళ ఏకంగా 20 నెలల పసుబిడ్డకు సిగరెట్ మద్యం తాగిపిస్తూ వేధింపులకు గురిచేసింది.
దీంతో చిన్నారి గట్టిగా ఏడవడంతో ఏం జరిగిందో అని గమనించడానికి వెళ్లిన స్థానికులకు అక్కడ జరుగుతుంది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏకంగా ఇలా చిన్నారికి సిగరెట్ మద్యం తాగిస్తున్న తల్లిని అడ్డుకున్నారు. అయితే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ అధికారులకు సమాచారం అందించారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు మహిళ నివాసానికి చేరుకొని బిడ్డను రక్షించారు. మహిళలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం తల్లి బిడ్డ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కస్టడీలోనే ఉన్నారని సమగ్ర విచారణ జరిపిన తర్వాత తగు చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారిపోయింది.