రోడ్డు మీద వెళ్తున్న చిన్నారిపై.. ఎద్దు ఎంత దారుణంగా దాడి చేసిందో చూడండి?

praveen
ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందో కానీ ఇక మనుషులను చూస్తే చాలు అన్ని జంతువులు ఏకంగా బద్ధ శత్రువులను చూసినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. పుట్టుకతోనే మనుషులకి ఆయా జంతువులకి మధ్య జాతి వైరం కొనసాగుతుందేమో అన్న విధంగా ఏకంగా మనుషులపై దారుణంగా దాడులకు పాల్పడుతున్నాయి. ఇక ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత ఇక ఎక్కడైనా అలాంటి జంతువులు కనిపించాయి అంటే చాలు మనుషులు భయపడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వీధి కుక్కలు ఎంత దారుణంగా మనుషులపై దాడికి పాల్పడుతూ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 మనుషులు కనిపిస్తే చాలు దారుణంగా మీద పడిపోయి దాడి చేస్తూ ఉన్నాయి. అయితే ఇలా కుక్కల దాడి ఘటనలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపడేలా చేశాయి అన్న విషయం తెలిసిందే. దీంతో ఇలాంటి దాడి ఘటనల గురించి తెలిసిన తర్వాత ఎక్కడైనా కుక్కలు ఉన్నాయి అంటే చాలు ఇక అందరూ భయపడిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే కేవలం కుక్కలు మాత్రమే కాదు మూగజీవాలుగా పిలుచుకునే ఎద్దులు గేదెలు సైతం మనుషులపై దాడికి పాల్పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయ్. ఇలాంటి తరహా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.

 ఇక ఇప్పుడు ఇలాంటి ఒక వీడియో వైరల్ గా మారిపోయింది. స్కూల్ నుండి వస్తు రోడ్డుపై హాయిగా నడుచుకుంటూ వెళ్తున్న చిన్నారిపై ఒక ఎద్దు దారుణంగా దాడి చేసింది. కొమ్ములతో పొడుస్తూ బీభత్స వాతావరణాన్ని సృష్టించింది. అయితే పక్కన ఉన్నవారు గేద ఉగ్రరూపం చూసి భయంతో దగ్గరికి రావడానికి కూడా వణికిపోయారు. అయితే పక్కనే ఉన్నవారు రాళ్లతో కొట్టిన కూడా ఆ గేదె వెనకడుగు వేయకుండా ఆ చిన్నారిపై కొమ్ములతో దాడి చేయడం గమనార్హం. ఇక ఈ ఘటనలో చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఇక ఒక వ్యక్తి కర్రను విసరడంతో ఎద్దు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాగా సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: