మరో మహిళపై భార్య కామం.. చివరికి ఏం చేసిందంటే?
ఆమెకు పెళ్లయింది. పిల్లలు కూడా ఉన్నారు. అయితే హాయిగా భర్తతో సంసారం చేసుకుంటూ గడపాల్సిన ఆమెకు.. ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. ఏకంగా భర్త మేనకోడలిపై ఆమె కామం పెంచుకుంది. ఆగండి ఆగండి ఆమె అంటున్నారు. మేనకోడలిపై కామం పెంచుకుంది అంటున్నారు.. ఇదేదో కన్ఫ్యూజన్ గా ఉంది అని అనుకుంటున్నారు కదా. నిజమే పూర్తి స్టోరీ తెలిస్తే గాని మీకు ఈ కన్ఫ్యూషన్ క్లారిటీగా మారదు. ఇలా భర్త మేనకోడలుపై కన్నేసిన సదరు మహిళ చివరికి ఆమెను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆమె చెప్పిన విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు.
మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో ఈ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇలా భర్త మేనకోడలని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న మహిళ.. ఏకంగా లైంగికంగా వేధించడం మొదలుపెట్టింది. కాగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు మహిళలను అరెస్టు చేసి విచారించారు. ఈ విచారణలో ఆమె చెప్పిన షాకింగ్ నిజాలు తెలిసి అందరూ అవాక్కయ్యారు. తాను ఒక లెస్బియన్ అని.. తన భర్తతో వైవాహిక సంబంధం తనకు అవసరం లేదని.. అయితే బాలికతో తనకు శారీరక సంబంధం ఉందని.. అందుకే ఇలా కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాను అంటూ పోలీస్ విచారణలో ఒప్పుకుంది సదరు మహిళ. విషయం తెలిసి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.