ఒక కుర్రాడు.. ఇద్దరమ్మాయిలు.. కోరిక తీర్చమన్నాడని.. చివరికి?

praveen
ప్రస్తుత కాలంలో ప్రేమ అనేది ఒక కపట నాటకంలా మారిపోయింది.  అవసరాలు తీర్చుకోవడం కోసం ప్రేమిస్తున్నారు తప్ప నిజమైన ప్రేమ ఎక్కడ కనిపించడం లేదు. అయితే తాము నిజంగానే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నామని.. జీవితంలో ఏ కష్టం రాకుండా చూసుకుంటాము అంటూ ఎంతో మంది మాయమాటలు చెప్పి ప్రేమలోకి దింపుతున్నారు. ఇక సమయం సందర్భం చూసి నిజస్వరూపాన్ని బయట పెట్టడం లాంటివి చేస్తున్నారు. దీంతో అబ్బాయిల చేతిలో మోసపోయిన ఎంతోమంది అమ్మాయిలు చివరికి నడిరోడ్డున పడి న్యాయపోరాటం చేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎన్నో వెలుగులోకి వచ్చాయి.

 అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయేది మాత్రం మరింత దారుణమైన ఘటన అని చెప్పాలి. ఏకంగా ఆ ఇద్దరు ప్రేమించుకున్నారు. సినిమాలు, షికార్లకు తిరిగారు. అయితే వారిద్దరి మధ్య సానిహిత్యం ఎక్కువ అవ్వడంతో తన కోరిక తీర్చాలి అంటూ యువకుడు యువతీని ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టాడు. అయితే మొదట్లో ఆమె నో చెప్పుతూ వచ్చింది. కానీ యువకుడి నుంచి వేధింపులు ఎక్కువ అవ్వడంతో చివరికి ప్రేమించిన వాడినే చంపేసేందుకు సిద్ధమయింది. చత్తీస్గడ్ లోని బలరాంపూర్ జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది.

 ఫుట్సూర గ్రామానికి చెందిన 18 ఏళ్ల వీరేంద్ర యాదవ్ తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. అయితే ఒకవైపు కాలేజీ చదువు కొనసాగిస్తూనే ఇంకోవైపు బట్టల షాపులో పార్ట్ టైమ్  జాబ్ చేస్తున్నాడు. అయితే అదే గ్రామానికి చెందిన ఒక యువతితో వీరేంద్రకు పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారింది. దీంతో సినిమాలకు షికార్లకు తిరగడం మొదలుపెట్టారు. అయితే సదరు యువతీ స్నేహితులతో ఒక చిన్న ఇంట్లో అద్దెకు ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవితం సాగిస్తుంది. వీరి మధ్య చనువు పెరగడంతో తన కోరిక తీర్చమని వీరేంద్ర ఆమెను ఫోర్స్ చేయడం మొదలుపెట్టాడు. ఇటీవల కాలంలో ఎంతో మంది యువకులు లైంగిక వాంఛ తీర్చుకొని ముఖం చాటేస్తున్నారు అన్న విషయం దృష్టిలో ఉంచుకొని ఆ యువతి మాత్రం వీరేంద్రకు నో చెబుతూ వచ్చింది. కానీ వీరేంద్ర లైంగిక కోరిక తీర్చమని మరింత వేధించడం మొదలుపెట్టడంతో వేధింపులు భరించలేక తన మైనర్ స్నేహితురాలితో కలిసి ఏకంగా హత్య చేసేందుకు ప్లాన్ వేసింది. వీరేంద్రను తాము ఉంటున్న ఇంటికి పిలిపించి నైలాన్ తాడుతో అతని మెడకు బిగించి హత్య చేశారు. తన అన్నయ్య కనిపించడం లేదని వీరేంద్ర సోదరి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి  దిగిన పోలీసులు యువతిపై అనుమానం వ్యక్తం చేశారు. ఇక తమదైన శైలిలో పోలీసులు విచారించడంతో అసలు నిజం బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: