ఇద్దరు కరుడగట్టిన నేరస్తుల మధ్య ప్రేమ.. బెయిల్ పై బయటికొచ్చి?

praveen
సాధారణంగా సినిమాల్లో డైరెక్టర్లు ప్రేక్షకులందరినీ కూడా కట్టిపడేసేందుకు ఎంతో వినూత్నమైన ఆలోచన చేసి కొన్ని కొన్ని సన్నివేశాలను సినిమాల్లో పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అలాంటి సన్నివేశాలలో  పెద్ద గ్యాంగ్ స్టర్స్ గా కొనసాగుతున్న వాళ్ళు పెళ్లి చేసుకోవడం ఒకటి. అయితే ఇక ఇలాంటి పెళ్లి చేసుకున్న డాన్స్ కి సంబంధించిన సన్నివేశాలను కొన్ని కొన్ని సార్లు ఫన్నీగా చూపించి ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటే.. ఇంకొన్నిసార్లు మాత్రం ఏకంగా ఇద్దరు పగ కోసమే పెళ్లి చేసుకున్నట్లుగా చూపించి ప్రేక్షకులను భయపెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు.

 సినిమాల్లో ఇలా గ్యాంగ్ స్టర్స్ ఏకంగా భార్య భర్తలుగా ఉండే సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే నిజ జీవితంలో కూడా ఇక ఇలాంటివి జరుగుతాయా అంటే గ్యాంగ్ స్టర్స్ పెళ్లి చేసుకోవడం ఓకే కానీ ఏకంగా ఇద్దరు పెద్ద గ్యాంగ్ స్టార్ పెళ్లి చేసుకోవడం కేవలం సినిమాల్లో మాత్రమే జరుగుతుంది అని చెబుతారు ఎవరైనా. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా కరుడ గట్టిన ఇద్దరు నేరస్తులు మధ్య ప్రేమ పుట్టింది. చివరికి ఆ ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధం అయిపోయారు.

 దీంతో ఈ గ్యాంగ్ స్టర్స్ కి పెళ్లికి సంబంధించిన వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. రాజస్థాన్ కు చెందిన అనురాధ హర్యానాకు చెందిన సందీప్ మార్చ్ 12వ తేదీన పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. అయితే ఇప్పటికే ఓ నేరం కింద జైలు శిక్ష అనుభవిస్తున్నాడు సందీప్. ఈ క్రమంలోనే అతనికి కోర్టు పెళ్లి కోసం ఆరు గంటల పెరోల్ ఇవ్వగా.. ఇక మరో కేసులో శిక్ష అనుభవిస్తున్న అనురాధ బెయిల్ పైన ప్రస్తుతం బయట ఉంది. వీరిద్దరూ కూడా హత్యలు దోపిడీలు మనీలాండరింగ్ కిడ్నాప్ లాంటి నేరాలకు పాల్పడ్డారు. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా వీరిద్దరి మధ్య  ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. గత నాలుగేళ్ల నుంచి ప్రేమలో ఉన్న ఈ ఇద్దరు గరుడ గట్టిన నేరస్తులు.. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: