ఫ్రెండ్ కి బదులుగా.. అతను పరీక్ష రాసాడు.. చివరికి?

praveen
ప్రతి మనిషి జీవితంలో ఎన్నో రకాల బంధాలు ఉన్నప్పటికీ.. అటు స్నేహబంధం మాత్రం ఎంతో గొప్పది అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఇక రక్తసంబంధం లేకపోయినా స్నేహబంధం ఇక కష్టసుఖాల్లో తోడు ఉంటుంది. ఇక అన్ని బాధలను పంచుకుంటుంది. ఏదైనా సమస్య వస్తే నేనున్నాను అంటూ వెన్నుతడుతుంది  అందుకే ఇక ప్రతి మనిషికి బంధాలు బంధుత్వాలు ఉన్నా లేకపోయినా ఒక మంచి స్నేహితుడు ఉంటే సరిపోతుంది అని అంటూ ఉంటారు. అయితే స్నేహితుడి కోసం మరో స్నేహితుడు ఏం చేయడానికైనా సిద్ధపడిపోతూ ఉంటాడు అనే విషయం తెలిసిందే.

 ఇక్కడ ఒక యువకుడు కూడా ఇలాంటిదే చేశాడు. ఇక్కడ ఒక యువకుడు తన స్నేహితుని మేలుకోరి ఒక పని చేయాలని అనుకున్నాడు. చివరికి చేయకూడని పని చేసి అడ్డంగా బుక్ అయ్యాడు  ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా స్నేహితుడు పరీక్ష రాయాల్సి ఉండగా అతని స్థానంలో మరో స్నేహితుడు వెళ్లి ఎగ్జామ్ రాశాడు. కానీ చివరికి దొరికిపోయాడు. మధ్యప్రదేశ్లో ఈ వింతైన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఇలా ఒకరికి బదులు మరొకరు ఎగ్జామ్ రాయడం.. కేవలం సినిమాలలో మాత్రమే చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి ఘటన జరిగింది.

 గత వారం రోజుల నుంచి కూడా మధ్యప్రదేశ్లో 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే గ్వాలియర్ లో ఉండే సంజయ్ పాల్ అనే యువకుడు తన స్నేహితుడి కోసం చేయకూడని రిస్క్ చేశాడు. ఏకంగా స్నేహితుడు రాయాల్సిన పరీక్షలను సంజయ్ పాల్ రాయడానికి సిద్ధమయ్యాడు. అయితే ఎవరికి అనుమానం రాకుండా.. సంజయ్ ఏకంగా నాలుగు పరీక్షలను కూడా పూర్తి చేశాడు. కానీ దురదృష్టవశాత్తు ఐదో పరీక్ష రాస్తున్న సమయంలో దొరికిపోయాడు. ఇదేంటి అని ప్రశ్నిస్తే తన స్నేహితుడు అనారోగ్యం బారిన పడటంతో అతనికి బదులు తాను పరీక్షలు రాస్తున్నట్లు తెలిపాడు. కాగా పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: