AB పాజిటివ్ కి బదులుగా.. 'O' పాజిటివ్ రక్తాన్ని ఎక్కించారు.. చివరికి?

praveen
సాధారణంగా ఈ లోకంలో అన్ని దానాలలో కెల్లా రక్తదానం ఎంతో గొప్పది అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే రక్తదానం ద్వారా ఏకంగా మరో మనిషికి పునర్జన్మను అందించవచ్చు అని చెప్పాలి. ఈ క్రమంలోనే నేటి రోజుల్లో చాలా మందికి రక్తదానంపై అవగాహన వచ్చింది. ఈ క్రమంలోనే స్వచ్ఛందంగానే రక్తం దానం చేసేందుకు ముందుకు వస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా ఎంతోమంది దగ్గర నుంచి రక్తాన్ని సేకరించే వైద్యులు ఇక అవసరమైన పేషెంట్లకు ఈ రక్తాన్ని ఎక్కించడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇలా రక్తాన్ని ఎక్కించే సమయంలో వైద్యులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ బ్లడ్ గ్రూప్ వారికి అదే బ్లడ్ గ్రూప్ కి చెందిన రక్తాన్ని మాత్రమే ఎక్కించాలి. ఈ విషయంలో పొరపాటు చేస్తే ఏకంగా పేషెంట్ ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది.

 అందుకే ఇలా వేరే వాళ్ళ రక్తాన్ని  మరో పేషెంట్ కి ఎక్కించేటప్పుడు ఇక వైద్యులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వైద్యులు మాత్రం ఈ విషయంలో నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారు. ఏకంగా ఏబి పాజిటివ్ గ్రూప్ కలిగిన ఒక పేషెంట్ కి ఏకంగా ఓ పాజిటివ్ రక్తాన్ని ఎక్కించారు. ఈ ఘటన రాజస్థాన్లో వెలుగులోకి వచ్చింది. చివరికి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా సదరు వ్యక్తి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. సవాయి మాన్సింగ్ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన 23 ఏళ్ల యువకుడికి ఎక్కువ రక్తం పోయింది. దీంతో అతనికి రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తప్పుడు రక్తం ఎక్కించడంతో చివరికి రోగి మరణించాడు.

 జైపూర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో నడిచే సవాయి మాన్సింగ్ ఆసుపత్రిలో ఒక వ్యక్తికి ఏబి పాజిటివ్ రక్తానికి బదులుగా ఓ పాజిటివ్ రక్తాన్ని ఎక్కించారు. బాధితుడు సచిన్ శర్మ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స సమయంలో ట్రామా సెంటర్లో ఒక వార్డు బాయ్ అవసరమైన ఏబి పాజిటివ్ రక్తానికి బదులు ఓ పాజిటివ్ రక్తాన్ని ఎక్కించాడు. ఇక రక్త మార్పిడి తర్వాత రోగి రెండు మూత్రపిండాలు పనిచేయడంలో ఇబ్బందులు ఏర్పడటంతో పాటు మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో అతను చివరికి ప్రాణాలు కూడా కోల్పోయాడు. అయితే దీనిపై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తామని.. నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని హాస్పిటల్స్ సూపర్డెంట్ ఆచల్ శర్మ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: