ఓరినాయనో.. ఆ బెగ్గర్ ఆదాయం రూ.2.5 లక్షలు?

praveen
ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా యాచకులు కనిపిస్తూనే ఉన్నారు. గుడికి వెళ్ళిన గుడిమెట్ల మీద.. ఇక బస్టాండుకు వెళ్లిన లేదంటే రైల్వే స్టేషన్కు వెళ్లిన ప్రతిచోట ఇక చేయిచాచి సహాయం చేయమని అర్థిస్తున్న వారు కనిపిస్తూనే ఉన్నారు. అయితే ఇలా యాచకులను చూసినప్పుడు అయ్యో పాపం అనిపించేది ఒకప్పుడు. ఈ క్రమంలోనే చేతిలో ఉన్న చిల్లరను ఇక వారికి దానం చేసేవారు. ఇలా దానం చేయడం ద్వారా ఇక సహాయం చేయడమే కాదు  పుణ్యం కూడా మూటగట్టుకోవచ్చు అని అందరూ భావించేవారు. కానీ ఇప్పుడు యాచకులపై ఉన్న అభిప్రాయం అందరిలో మారిపోయింది.

 ఎందుకంటే ఇలా ఏకంగా గుడి మెట్ల పైన బస్ స్టాప్ లలో చెయ్యి చాచి సహాయం కోసం యాచించే బెగ్గర్స్ ఏకంగా లక్షాధికారులు అన్న విషయం ఇటీవల కాలంలో బయటపడుతుంది. ఏకంగా ఇలా దానం చేసే వారి దగ్గర కూడా లేనంత డబ్బులు ఏకంగా ఇలా యాచీస్తూ సంపాదిస్తున్నారు అన్న విషయం తెరమిదికి వస్తూ ఉంది. దీంతో నేటి రోజుల్లో యాచకులను చూసిన కూడా దానం చేయాలని ఆలోచన మాత్రం రావడం లేదు చాలామందికి. అయితే ఇప్పుడు ఇలా ఒక యాచకురాలి ఆదాయం గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి.

 ఉద్యోగం చేస్తే నెలకి 30 నుంచి 40 వేల వరకు సంపాదించవచ్చు. అదే సాఫ్ట్వేర్ ఉద్యోగం అయితే దాదాపు లక్ష రూపాయల వరకు జీతం వస్తుంది. కానీ ఇక్కడ ఒక యాచకురాలు మాత్రం 2.5 లక్షల సంపాదిస్తుంది. భిక్షాటన చేసే ఒక మహిళ యాచకురాలు 45 రోజుల్లో 2.5 లక్షలు సంపాదించింది. మధ్యప్రదేశ్ ఇండోర్లో బావ్రాసుల స్క్వేర్ వద్ద భిక్షాటన చేస్తూ 2.5 లక్షలు సంపాదించినట్లు యాచకురాలు పేర్కొంది. అంటే ఆమె సంపాదన సగటున ఏడాదికి 20.07 లక్షలు కావడం గమనార్హం. సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఇక ఈ రేంజ్ లో సంపాదించడం లేదు. కాగా ఇండోర్లో దాదాపుగా 7000 మంది బెగ్గర్స్ ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: