క్షుద్ర పూజలు చేస్తున్నాడనే అనుమానం.. ఓ రోజు రాత్రి గ్రామస్తులు ఏం చేశారంటే?

praveen
బ్లాక్ మ్యాజిక్.. అదేనండి క్షుద్ర పూజలు.. ఈ పేరు వినిపించింది అంటే చాలు ఎందుకో తెలియకుండానే వెన్నులో భయం పడుతూ ఉంటుంది. నిజంగానే క్షుద్ర పూజల ద్వారా చెడు జరుగుతుందా అంటే మాత్రం ఎవరు కూడా జరుగుతుంది అని బల్ల గుద్ది చెప్పలేరు. అలా అని జరగదు అని కూడా కూడా చెప్పలేరు. ఎందుకంటే ఇంకా ఎక్కడైనా ఏదైనా కీడు జరిగింది అంటే చాలు అది బ్లాక్ మ్యాజిక్ కారణంగానే జరిగిందని అందరూ అనుకుంటారు. అయితే నేటి ఆధునిక సమాజంలో అందరూ టెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంటే.. ఇంకా అక్కడక్కడా మంత్రాలకు చింతకాయలు రాలుతాయని కొంతమంది నమ్ముతున్నారు అని చెప్పాలి.

 చివరికి ఇంకా క్షుద్ర పూజలు చేస్తూ ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారు. ఇక మరికొన్ని చోట్ల క్షుద్ర పూజలు చేస్తున్నారు అనే అనుమానంతో గ్రామస్తులు అందరూ కూడా ఒక వ్యక్తిపై మూకుమ్మడిగా దాడి చేసి దారుణంగా ప్రాణాలు తీయడం లాంటి ఘటనలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. క్షుద్ర పూజలను ఇంకా గుడ్డిగా నమ్ముతున్న వారు చాలామంది అక్కడక్కడ కనిపిస్తున్నారు. అయితే ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా దారుణ ఘటన గురించే.

 చేతబడి బాణమతి పేరుతో క్షుద్ర పూజలు చేస్తూ ఎంతోమంది అనారోగ్యానికి కారణం అవుతున్నాడని ఒక వ్యక్తి పై గ్రామస్తులందరికీ కూడా అనుమానం ఉంది. అయితే తన భార్య కుమార్తె పై కూడా మంత్రాలు ప్రయోగిస్తున్నాడని ఒక వ్యక్తి అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఇదే విషయం గ్రామస్తులతో చర్చించాడు. చివరికి ఓ రోజు రాత్రి దారుణానికి పాల్పడ్డాడు. మెదక్ జిల్లా నంగునూరు మండలం ఘనపూర్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంకటయ్య అనే వ్యక్తి బంధువుల ఇంటికి వెళ్లి ఇంటికి తిరుగు పయనమయ్యాడు. అయితే చెక్ డాం వద్ద పలువురు అతన్ని అడ్డుకొని తువాళ్ళతో మెడను బిగించి చంపేశారు. జెసిబి గుంతలో డెడ్ బాడీని పడేసారు. అయితే మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టుగా అసలు విషయం బయటపడింది. దీంతో నిందితులను అరెస్టు చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: