సెక్స్ వర్కర్ తో ప్రేమ.. చివరికి జైలుకు?

praveen
ఇటీవల కాలంలో ప్రేమ అనేది ప్రాణాలు పోవడానికి కారణంగా మారిపోతుంది. ఏకంగా ప్రేమించిన పాపానికి చివరికి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వారు మోసం చేయడంతో ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలు వదులుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయ్. ఇంకొన్ని ఘటనల్లో ప్రేమించిన వారే మోసం చేశారని దారుణంగా హత్యలు చేస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరిని ఉలిక్కిపడేలా చేస్తూన్నాయి.  అయితే కొంతమంది ఏకంగా ప్రేమను గెలిపించుకోవడానికి పెద్దలను ఎదురించి మరి పెళ్లి చేసుకుంటే అది నచ్చక తల్లిదండ్రుల పిల్లలను దారుణంగా హత్య చేస్తున్నారు. ఇలా ఏదో ఒక విధంగా ప్రేమ అనేది ప్రాణాలు పోవడానికి కేరాఫ్ అడ్రస్ గా  మారిపోయింది.

 ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఒక సెక్స్ వర్కర్ ను ప్రేమించాడు యువకుడు. కానీ ఆమె అతని కళ్ళు గప్పి మరో యువకుడితో జల్సాలు చేయడం మొదలుపెట్టింది. దీంతో తట్టుకోలేకపోయిన యువకుడు ఆమె రెండో ప్రియుడిపై బుల్లెట్ల వర్షం కురిపించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. ఓ ప్రాంతంలో ఓ ఎర్రటి కారు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు గుర్తించారు. అక్కడ వెళ్లి చూడగా మృతదేహం లభ్యం అయింది.ఏకంగా శరీరంలో నాలుగు బుల్లెట్లు దిగాయ్. మృతుడు దీక్షాత్ పాండ్యాగా గుర్తించారు పోలీసులు.

 అయితే హత్యకు రెండు రోజుల ముందు వచ్చిన కాల్స్ ఆధారంగా ఈ హత్యలో ఓ యువకుడు యువతీ పాత్ర ఉందని అంచనా వేశారు. మొహిసిన్ అనే యువకుడు సెక్స్ వర్కర్ గా ఉన్న యువతిని ప్రేమించాడు. అయితే ఇటీవల దీక్షత్ తో ఆమె ప్రేమలో పడింది. ఇక ఈ కొత్త లవర్స్ ఇద్దరూ కలిసి తిరగడం ప్రారంభించారు. ఇది మొహసిన్ కి తెలిసింది. ఇటీవల పెళ్లికి వెళ్లగా మొహసిన్ అదే పనిగా ఫోన్ చేశాడు. దీంతో చిరాకు వచ్చిన దీక్షత్ ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేసాడు. దీంతో ఇద్దరి మధ్య మాట పెరిగింది. నేను ఉన్న ప్లేస్ కి రావాలి అంటూ దీక్షత్ కు మొహసిన్ సవాల్ విసరగా.. కోపంతో చివరికి సెక్స్ వర్కర్ ను తీసుకొని అక్కడికి వెళ్ళాడు. ఇక వారు అక్కడికి రాగానే తన చేతిలో ఉన్న తుపాకితో నాలుగు రౌండ్లకు కాల్పులు జరిపాడు మొహిసిన్. దీంతో దీక్షాత్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. కాగా పరారీలో ఉన్న మోహిసిన్ గురించి ఇప్పుడు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: