కూతురిపై తండ్రి అత్యాచారం.. కోర్టు ఏం శిక్ష వేసిందో తెలుసా?

praveen
నేటి సభ్య సమాజంలో నీచమైన మనుషులు తప్ప మానవత్వంతో ఆలోచించే మనుషులు ఎక్కడ కనిపించడం లేదు అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. దీనికి కారణం నేటి రోజుల్లో వెలుగులోకి వచ్చే ఘటనలే. ఒకప్పుడు పరాయి వాళ్ళు ఎటు పోయిన పర్వాలేదు. కానీ సొంతవాళ్లు మాత్రం ఎప్పుడు బాగుండాలని కోరుకునేవారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం సొంత వారి విషయంలో కూడా కాస్త అయినా జాలి దయ చూపించడం లేదు. అయితే ఇటీవల కాలంలో ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్న ఘటనలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి.

 అయితే ఒకప్పుడు కేవలం బయట రోడ్డుపై ఉండే ఆకతాయిలు మాత్రమే ఇలా ఆడపిల్లలను వేధింపులకు పాల్పడేవారు. కానీ ఇప్పుడు ఏకంగా సొంతింటిలోనే ఆడపిల్లలకు లైంగిక వేధింపులు ఎదురవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక బయట ఏదైనా సమస్య వస్తే నేనున్నాను అంటూ భరోసా ఇచ్చి అనుక్షణం కూతురును కాపాడుకోవాల్సిన తండ్రే కామంతో ఊగిపోతూ చివరికి అత్యాచారాలు చేస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఒక నీచపు తండ్రి కన్న కూతురు పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి కోర్టు అతనికి కఠినమైన జైలు శిక్ష విధించింది.

 ఏకంగా కూతురిపై అత్యాచారానికి పాల్పడిన ఒక తండ్రికి కోర్టు 150 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కేరళ మలపురం జిల్లాలో ఓ వ్యక్తికి ముగ్గురు భార్యలు ఉన్నారు  వారిలో ఒక భార్య కుమార్తె పై అతను అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఘటనపై కేసు నమోదు చేసుకుని అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే కోర్టు ముందు హాజరుపరచగా అతను అత్యాచారం నేరం చేశాడు అన్న విషయం నిరూపితమైంది. దీంతో పలు సెక్షన్ల కింద అతనికి 150 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ శిక్షలు అన్నింటినీ కూడా ఏకకాలంలో అనుభవించాలి అంటూ ఆదేశించింది. దీంతో గరిష్టంగా శిక్ష మొత్తం కలిపి 40ఏళ్ల పాటు అతను జైల్లో ఉండాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: