ఓ దేవుడా.. ఆ చిన్నారి విషయంలో కూడా దయలేదా?

praveen
ప్రతిరోజు సోషల్ మీడియాలో ఎన్నో రకాల ఘటనలు వెలుగులోకి వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే  ఇక ఇలాంటి తరహా ఘటనల్లో కొన్ని అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి   కొన్ని ఘటనలు అయితే మనిషి జీవితం ఇంతేనా అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలిగేలా చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఎందుకంటే అంత సాఫీగా సాగిపోతుంది అనుకున్న సమయంలో ఊహించని ఘటనలు చివరికి ప్రాణాలను తీసేస్తూ ఉంటాయి. ఇలాంటి ఘటనలు ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇలాంటి విషాదకర ఘటనల గురించి తెలిసిన తర్వాత దేవుడు చేతిలో మనుషుల జీవితాలు కేవలం కీలుబొమ్మలాంటివి మాత్రమే అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది  అభం శుభం తెలియని చిన్నారుల విషయంలో ఎందుకు దేవుడు ఇంత కఠినంగా ఉంటాడు అని మనసు తరుక్కుపోతూ ఉంటుంది అని చెప్పాలి. రంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఒక విషాదకర ఘటన కూడా ప్రతి ఒక్కరి మనసును కదిలిస్తోంది   అభం శుభం తెలియని 16 నెలల చిన్నారి చివరికి ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోయింది.

 అప్పటివరకు కళ్ళ ముందు ఎంతో అల్లరి చేస్తూ ఆడుకున్న కూతురు ఇక లేదు అన్న విషయాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేక అరణ్య రోదనగా విలపించారు అని చెప్పాలి.కొత్తూరులో ఈ విషాదకర ఘటన వెలుగు చూసింది  బీహార్ కు చెందిన చిన్నారి తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న ఒక వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండగా.. చిన్నారి ఆడుకుంటూ ఆడుకుంటూ నీటి బకెట్లో పడిపోయింది. ఆ సమయంలో ఎవరు గమనించలేదు. దీంతో ఊపిరాడక చిన్నారి ప్రాణాలు కోల్పోయింది  అయితే అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఇక లేదు  అన్న విషయాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేక గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: