అయ్యో పాపం అని లిఫ్ట్ ఇస్తే.. ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా?

praveen
ఒకప్పటితో పోల్చి చూస్తే నేటి రోజుల్లో మనిషి జీవనశెలలో ఎన్నో మార్పులు వచ్చాయని చెప్పాలి. ఒకప్పుడు ఎక్కువ మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణం సాగించేవారు. ఇక ఆర్టీసీ బస్సు ద్వారానే గమ్యస్థానాలకు చేరుకునేవారు. అయితే కొంతమంది ఇక ఆర్టీసీ బస్సులో టికెట్ కొనేందుకు కూడా డబ్బులు లేకపోవడం కారణంగా.. ఇక రోడ్డుపై లిఫ్ట్ అడిగి ఇక ఎవరో ఒకరి వాహనం సహాయంతో చివరికి గమ్యస్థానాలకు చేరుకునేవారు అన్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో మాత్రం ఇలా లిఫ్ట్ అడిగే జనాలు కాస్త తక్కువగానే కనిపిస్తూ ఉన్నారు.

 నేటి రోజుల్లో ఇలా లిఫ్ట్ అడుగుతున్న వారు ఎవరైనా కనిపించారు అంటే అయ్యో పాపం అని వారిని బైక్ ఫై ఎక్కించుకొని ఇక తాము వెళ్లే దారిలో దించేస్తున్న మానవత్వం ఉన్న జనాలు కూడా చాలామంది కనిపిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన చూస్తే మాత్రం మరోసారి ముక్కు ముఖం తెలియని మనుషులకు లిఫ్ట్ ఇవ్వాలంటేనే భయపడిపోతారు అని చెప్పాలి. మరి ముఖ్యంగా ఎవరైనా అమ్మాయి లిఫ్ట్ అడిగింది అంటే ఇక అయ్యో పాపం అని వాహనం ఎక్కించుకోవడానికి ఇక 100 సార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఒక అమ్మాయి ఏకంగా లిఫ్ట్ అడిగి చేసిన పని కాస్త ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తుంది.

 హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కిలేడీని పోలీసులు అరెస్టు చేశారు. లిఫ్ట్ అంటూ రోడ్డుపై వాహనాన్ని ఆపి రేప్ కేసు పెడతాను అంటూ బెదిరింపులకు పాల్పడుతుంది  ఈ క్రమంలోనే ఒక వ్యక్తి ఇదే విషయంపై పోలీసులను ఆశ్రయించాడు. అయితే జూబ్లీ చెక్పోస్ట్ వద్ద లిఫ్ట్ అడిగి కారెక్కిన ఆమె కేబీఆర్ పార్కు వద్దకు రాగానే బట్టలు చించుకొని హల్చల్ చేసిందని అతను తెలిపాడు. అయితే డబ్బులు కోసం ఆమె ఇలాంటి చేష్టలకు పాల్పడుతుంది అంటూ పోలీస్ లకు ఫిర్యాదు చేయగా.. ఇక సదరు కిలేడిని అరెస్టు చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: