షాకింగ్ ఘటన : కరెంటు పోవడంతో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి?

praveen
ఇటీవల కాలం లో మనుషుల ప్రాణాలు ఎప్పుడు ఎలా పోతుందో కూడా ఊహకందని విధంగా మారి పోయింది. ఈ మధ్య కాలం లో అయితే సడన్ హార్ట్ ఎటాకులకు కారణంగా పోతున్న ప్రాణాల సంఖ్య రోజురోజుకు పెరిగి పోయింది. ఏకంగా చూస్తూ చూస్తుండగానే ఎంతోమంది కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. అప్పుడు వరకు ఆరోగ్యంగా నవ్వుతూ కనిపించిన వారు కూడా అంతలోనే ఇక కానరాని లోకాలకు వెళ్ళిపోతున్నారు.

 ఇలాంటి తరహా ఘటనలు ప్రతి ఒక్కరిలో కూడా ప్రాణభయాన్ని కలిగిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక మరోవైపు అనూహ్య ఘటనల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతుంది అని చెప్పాలి. ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. ఏకంగా కరెంటు పోవడం కారణంగా ఒక వ్యక్తి ప్రాణం పోయింది. అదేంటి కరెంటు పోతే ప్రాణం ఎందుకు పోతుంది అనుకుంటున్నారు కదా. అయితే ఇలా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కరెంటు పోయిన సమయంలో వెంటిలేటర్ పై ఉన్నాడు. చివరికి ఊపిరాడక అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.

 విద్యుత్ అంతరాయంతో వెంటిలేటర్ పనిచేయక ఒక రోగి మరణించాడు. శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 45 ఏళ్ల బిక్షపతినీ ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇటీవల కరెంటు పోవడంతో జనరేటర్ ఆన్ చేయగా అది పనిచేయలేదు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా వెంటిలేటర్ ఆఫ్ అయింది. దీంతో ఇక ఊపిరి అందక అతను ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ ఘటన ప్రభుత్వాసుపత్రుల్లో వసతుల కొరతకు నిదర్శనంగా మారిపోయింది అంటూ ఇక ఎంతోమంది విమర్శలు చేస్తున్నారు. 
సదరు వ్యక్తి మృతితో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే బిక్షపతి ప్రాణం పోయిందని.. తమకు న్యాయం చేయాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: