రామచిలుక కారణంగా.. మూడేళ్లు విచారణ జరిగిన విడాకుల కేసు?
అయితే సాధారణంగా భార్యాభర్తలు కలిసి ఉండలేం అని నిర్ణయించుకున్నప్పుడు విడాకులు తీసుకోవాలి అని అనుకున్నప్పుడు కోర్టును ఆశ్రయించడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే తాము ఎందుకు విడిపోవాలి అనుకుంటున్నాము అనే విషయాలను కూడా కోర్టు ముందు వివరిస్తూ ఉంటారు. అయితే భార్యాభర్తలిద్దరును ఒక్కరి అంగీకారం లేకపోయినా కోర్టు విడాకులు మంజూరు చేయలేదు. ఈ క్రమంలోనే ఇద్దరు అంగీకారం ఉన్నప్పుడు మాత్రమే విడాకులు మంజూరు చేయగలరు. అయితే ఇటీవల ఇద్దరు భార్యాభర్తలు కూడా ఇలాగే విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు.
ఇద్దరు కూడా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఏకంగా ఒక రామచిలుక కారణంగా వీరి విడాకుల కేసు మూడు సంవత్సరాల పాటు కోర్టులో విచారణ జరిగింది మహారాష్ట్రలోని పూణేలో ఒక ఆఫ్రికన్ గ్రేచిలుక భార్యాభర్తల విడాకుల కేసును మూడేళ్లు నడిపింది. 2019లో జంటకు పెళ్లయింది. కొద్దిరోజులకు మనస్పర్ధలు వచ్చాయి. దీంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకొని పూణేలోని ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. అయితే కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ దంపతులు మాత్రం విడాకులకే మొగ్గు చూపారు. ఇలాంటి సమయంలోనే ఓ సమస్య వచ్చి పడింది. పెళ్లికి ముందు తాను కానుకగా ఇచ్చిన ఆఫ్రికన్ గ్రేట్ చిలుకను తిరిగి ఇస్తేనే విడాకులకు అంగీకరిస్తాను అంటూ భర్త శరతు పెట్టగా.. ఇక భార్య మాత్రం చిలుకను తిరిగి ఇచ్చేందుకు ససే మీరా అంది. దాదాపు మూడేళ్లు ఈ విడాకుల కేసు కొనసాగింది. ఎట్టకేలకు ఆ చిలుకను తిరిగి ఇచ్చేందుకు ఆమె అంగీకరించడంతో భర్త కూడా విడాకులకు అంగీకరించాడు. దీంతో కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది.