విధి ఆడిన నాటకం.. పశువుల మేత చిన్నారి ప్రాణం తీసింది?

praveen
నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే మనిషి ప్రాణానికి గ్యారెంటీ లేదు అన్న విషయం ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో ఊహించనీ ఘటనలు ప్రాణాలను తీసేస్తూ ఉంటాయి అని చెప్పాలి. మరి ముఖ్యంగా కొంతమంది చిన్నారుల విషయంలో విధి పగబట్టినట్లుగానే వ్యవహరిస్తూ ఉంటుంది. అభం శుభం తెలియని చిన్నారులను చివరికి ప్రాణాలను తీసేస్తూ ఉంటుంది అని చెప్పాలి.


 దీంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలను దూరం చేసి ఆ తల్లిదండ్రులకు అరణ్య రోదనను మిగులుస్తూ ఉంటుంది విధి. ఇక ఇటీవల నిజాంబాద్ జిల్లాలో కూడా ఇలాంటి ఒక విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఆర్మూరు మండలం చేపూరు గ్రామానికి చెందిన మహమ్మద్ జియావుద్దీన్ అనే నాలుగేళ్ల చిన్నారి అనూహ్య రీతిలో చివరికి మృత్యు ఒడిలోకి చేరుకున్నాడు. ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని మృతి చెందాడు. చేపూరు గ్రామానికి చెందిన మహమ్మద్ జియావుద్దీన్ మరో బాలికతో కలిసి ఆ గ్రామంలో ఉన్న ఒక పాడుబడ్డ  ఇంట్లో ఆడుకుంటున్నాడు. ఆ ఇంట్లో పశువులకు వేయడానికి నిలువ ఉంచిన మేత ఉంది. అయితే నిలువ ఉంచిన పశువుల మేతను సమీపంలో ఇద్దరు చిన్నారులు మంట పెట్టుకొని ఆడుకుంటుండగా.. పక్కనే ఉన్న పశువుల మేతకు కూడా నిప్పు అంటుకుంది.


 దీంతో ఆ చిన్నారులు అక్కడి నుంచి తప్పించుకోలేకపోయారు. ఇక మహమ్మద్ జియావుద్దీన్ మంటల్లో చిక్కుకొని పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాడు. ఇక పక్కనే ఉన్న బాలిక ఎంతో భయంతో అరుస్తూ అక్కడి నుంచి బయటికి పరుగులు పెట్టింది. ఈ క్రమంలోనే స్థానికులు గమనించి అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ.. అప్పటికే బాలుడు ప్రాణాలు పోయాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు దూరమవడంతో తల్లిదండ్రులు అరణ్యరోధంగా వినిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: